పేదలకు కేసీఆర్ గుడ్ న్యూస్: 58,59 జీవోలను పొడిగిస్తాం

By narsimha lodeFirst Published Sep 11, 2020, 5:41 PM IST
Highlights

పేద ప్రజల కోసం 58, 59 జీవోలను పొడిగించే ఆలోచన చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవిన్యూ ముసాయిదా బిల్లుపై ఎమ్మెల్యేల సందేహాలపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 


హైదరాబాద్: పేద ప్రజల కోసం 58, 59 జీవోలను పొడిగించే ఆలోచన చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవిన్యూ ముసాయిదా బిల్లుపై ఎమ్మెల్యేల సందేహాలపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 

58, 59 జీవో ప్రకారంగా తమ ప్రభుత్వం  1,40,328 మంది పేదలకు పట్టాలిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.58,59 జీవోలను మరింత పొడిగించాలని ఎమ్మెల్యేలు, మంత్రులు కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

also read:సమగ్ర సర్వే ద్వారానే భూముల సమస్యకు పరిష్కారం: కేసీఆర్

బీఆర్ఎస్ అంశం హైకోర్టు పరిధిలో ఉందన్నారు. మరో వైపు ఎల్ఆర్ఎస్ కూడ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. పీడ విరగడైందని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు.ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనుల్ని వేధించవద్దని అటవీశాఖ అధికారుల్ని ఆదేశిస్తామన్నారు.

 ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికెట్లు పట్టాలు కాదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ భూములకు సంబంధించి ధరణి పోర్టల్ లో ప్రత్యేక పేజీ పెడతామని సీఎం ప్రకటించారు.
 

click me!