ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను పెంచుతాం: కేసీఆర్

By narsimha lodeFirst Published Mar 26, 2021, 3:12 PM IST
Highlights

ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను కూడ పెంచుతామని  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

హైదరాబాద్:ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను కూడ పెంచుతామని  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్  శుక్రవారం నాడు ప్రసంగించారు. ఆర్టీసీని పరిరక్షించుకొనేందుకు బడ్జెట్ లో రూ. 3 వేల కోట్లను కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులంతా ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు.

also read:రాష్ట్రంలో అప్పులు పెరగలేదు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఏపీ స్థానంలో తెలంగాణ వస్తోందని తాను చెప్పానని .. ఇవాళ అదే జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచామన్నారు.తమకు కూడా జీతాలు పెంచాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడ జీతాలు పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు.

దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా జీతాలు తీసుకొంటున్నారని ఆయన చెప్పారు. తమను కూడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని కొందరు ఐఎఎస్ అధికారులు చెప్పిన విషయాన్నికేసీఆర్ గుర్తు చేశారు.ఎక్కువ జీతాలు తీసుకొంటున్న ఉద్యోగులు తెలంగాణకు చెందినవారేనని  చెప్పుకోవడం తనకు గర్వకారణమన్నారు

click me!