నవంబర్లో ఎన్నికలు అనుమానమే: ఉత్తమ్

By narsimha lodeFirst Published Sep 20, 2018, 2:36 PM IST
Highlights

:తెలంగాణలో ఏ అసెంబ్లీ స్థానంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశంపై  రెండు సర్వే సంస్థలతో సర్వే నిర్వహిస్తున్నట్టుగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు


హైదరాబాద్:తెలంగాణలో ఏ అసెంబ్లీ స్థానంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశంపై  రెండు సర్వే సంస్థలతో సర్వే నిర్వహిస్తున్నట్టుగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ సర్వే ఆధారంగానే అభ్యర్థులకు టిక్కెట్లను కేటాయించనున్నట్టు  ఆయన చెప్పారు.

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ మాసంలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.. కానీ, తనకు మాత్రం నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం లేదన్నారు.  రెండు రోజుల పాటు పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్న అభ్యర్థుల నుండి ధరఖాస్తులను స్వీకరించనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు ఉన్నాయని ఉత్తమ్ చెప్పారు.  ఓటర్ల జాబితాలో అక్రమాల విషయంలో  సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకొన్న విషయాన్ని తీవ్రంగా తీసుకొంటుందని నమ్ముతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

టీపీసీసీ కొత్త కమిటీల ఎఫెక్ట్: ట్విస్టిచ్చిన సుధీర్ రెడ్డి

టీపీసీసీ కొత్త కమిటీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు: వీహెచ్

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

 

click me!