సింగరేణి కోసం ఢిల్లీకెళ్లి పోరాటం చేస్తాం - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్

Published : Feb 07, 2022, 04:12 PM IST
సింగరేణి కోసం ఢిల్లీకెళ్లి పోరాటం చేస్తాం - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్

సారాంశం

ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రభుత్వ విప్, బాల్క సుమన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్ర హరిస్తోందని అనే కోణంలో సీఎం చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, బీజేపీలు వక్రీకరిస్తున్నాయని తెలిపారు. 

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసినట్టే సింగరేణిని (singareni)  కూడా ప్రైవేటు అప్పజెప్పాలని బీజేపీ కుట్ర పన్నిందని ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ (mla balka suman)అన్నారు. సోమవారం ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్ (kranthi kiran), డాక్టర్ మెతుకు ఆనంద్ (methuku anand)తో క‌లిసి ఆయ‌న ఆర్ఎస్ఎల్ఫీ (trslp) ఆఫీసులో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా బాల్క సుమ‌న్ మాట్లాడుతూ.. సింగ‌రేణి ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునేందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేస్తామ‌ని అన్నారు. ఈ విష‌యంలో మంత్రి కేటీఆర్ కేంద్ర బొగ్గు గ‌నుల మంత్రికి ప్రహ్లాద్ జోషి (prahlad jhoshi) కి లేఖ రాశార‌ని తెలిపారు. వందేళ్ల చ‌రిత్ర ఉన్న సింగరేణి  ని ప్రైవేటు పరం చేయొద్దని అందులో కేటీఆర్ కోరార‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని మోడీ (pm modi)కి లేఖ‌ రాశార‌ని, కానీ ఎలాంటి స్పంద‌న రాలేద‌ని చెప్పారు. కార్మికులు సమ్మె చేసినా ఉలుకు లేదు పలుకు లేద‌ని అన్నారు. 

గుజరాత్ (gujarath)లో లిగ్నైట్ (lignaite) గనులను ఆ రాష్ట్ర సంస్థకు కేంద్ర ప్రభుత్వం లీజుకు ఇచ్చింద‌ని బాల్క సుమన్ అన్నారు. కానీ సింగరేణి గనులను మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కు ఇవ్వ‌లేద‌ని తెలిపారు. గుజరాత్ కు ఓ నీతి తెలంగాణ కు ఓ నీతా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలమంతా కేంద్రం తీరు ను గమనిస్తున్నామ‌ని చెప్పారు. ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని అన్నారు.సింగరేణి ని దెబ్బ కొట్టడం ద్వారా తెలంగాణ ప్రగతి ని దెబ్బకొట్టే ప్రయత్నం కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం చేస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ పై కేంద్రం పగ బట్టిందని, రాష్ట్రంలోని బీజేపీ నేతల భరతం పడితే కేంద్రం తప్పకుండా దిగి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. నల్ల చట్టాలు ర‌ద్దు కోసం రైతులు పోరాటం చేసి విజ‌యం సాధించిన‌ట్టే, సింగరేణిని బ‌తికించుకునేందుకు పోరాటం చేస్తామ‌ని అన్నారు. 

సింగరేణి కి ఏదైనా జరిగితే దానికి బీజేపీ (bjp) దే బాధ్యతని ఆయ‌న అన్నారు. ముఖ్య‌మైన విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి బీజేపీ, కాంగ్రెస్ లు కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై వివాదం చేస్తున్నాయని బాల్క సుమ‌న్ ఆరోపించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాజ్యాంగ వ్య‌తిరేకి అని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హాయం లో రాజ్యాంగ సమీక్ష కు కమిటీ వేశారని గుర్తు చేశారు. చాలా మంది బీజేపీ మంత్రులు అంబేద్క‌ర్ కు వ్యతిరేకంగా మాట్లాడార‌ని చెప్పారు. రాజ్యాంగం మొదటి సవరణ తోనే రాష్ట్రాలకు భూ హక్కులను హరించార‌ని తెలిపారు. ఈ అంశాలు అంబేద్క‌ర్ (ambedkar) కు వ్య‌తిరేకం కాదా అని ప్ర‌శ్నించారు. 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హం తాము క‌డుతున్నామ‌ని, ఇన్నేళ్ల బీజేపీ చరిత్రలో కనీసం వంద అడుగుల విగ్రహాన్ని అయినా పెట్టాలని ఆలోచించిందా అని అన్నారు. 

ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దళిత బంధు (dhalitha bandu) ప‌థ‌కాన్ని మేనిఫెస్టో లో పెట్టే దమ్ము బీజేపీకి ఉందా అని బాల్క సుమ‌న్ ప్ర‌శ్నించారు. దళితులకు తెలంగాణలో అందుతున్న పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నాయా అని అన్నారు. దళితులు బీజేపీ కి వ్యతిరేక‌మ‌ని, అందుకే ఆ పార్టీకి తెలంగాణ‌లో దళిత ఎమ్మెల్యేలు లేరని అన్నారు. జై శ్రీరామ్ అని ఎప్పుడూ చెప్పే బీజేపీ ఇపుడు రాజకీయ పబ్బం కోసమే జై భీమ్ అంటోంద‌ని విమ‌ర్శించారు. తాము దళిత జాతి బిడ్డల‌మ‌ని, త‌మ‌లో దళిత రక్తం ప్రవహిస్తోంద‌ని అన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ (congress), బీజేపీ (bjp) లు పన్నిన వ‌ల‌లో ద‌ళితులు ప‌డొద్ద‌ని ఆయ‌న సూచించారు.  

రాజ్యాంగానికి సవరణలు చేసినా.. కొత్త రాజ్యాంగం తెచ్చినా అది అంబేడ్కర్ స్ఫూర్తి తోనే అవుతుంద‌ని బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ అనగానే రాత్రికి రాత్రే రాజ్యాంగం మారుతుందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అసలు విషయాలను బీజేపీ పక్కన బెడుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలకు ఆ పార్టీ గొడ్డలి పెట్టుగా మారిందని ఆరోపించారు. 750 మంది రైతుల మృతికి కారణమైన ప్రధాని మోడీ పైనే మొట్ట మొదటి కేసు పెట్టాల‌ని అన్నారు. వెంకట‌ చలయ్య కమిషన్ వేసినందుకు బీజేపీపై కేసు పెట్టాల‌ని తెలిపారు. అంబేడ్కర్ ను తిట్టిన బీజేపీ మంత్రులపై కేసులు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ద‌ళిత‌బంధు ఇస్తున్నందుకు త‌మ మీద కేసులు పెడ‌తారా అని ప్ర‌శ్నించారు. 

కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్, బీజేపీ రాద్దాంతం చేస్తున్నాయి  - డాక్టర్ మెతుకు ఆనంద్ 
కొత్త రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ లు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయ‌ని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ (methuku anand) ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నదన్నకోణం లోనే, ఆవేద‌న‌తో సీఎం కేసీఆర్ మాట్లాడారని చెప్పారు. ఓ సంద‌ర్భంలో రాజ్యాంగం అమలు కాకపోతే ధ్వంసం చేయాల‌ని అంబేద్క‌రే అన్నార‌ని గుర్తు చేశారు. ఆయ‌న అన‌గానే రాజ్యాంగాన్ని ధ్వంసం చేశారా అని ఆయ‌న ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టి రోజే కాంగ్రెస్, బీజేపీ దొంగ దీక్షలు, ధర్నాలకు తెరలేపాయ‌ని విమ‌ర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంట్ లో 2/3 మెజారిటీ, సగం రాష్ట్రాలు ఆమోదించాల‌ని గుర్తు చేశారు. స్వయంగా కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ (rajnath singh) పార్లమెంట్ (parlament)లో లౌకిక అనే పదం రాజ్యాంగం నుంచి తీసేయాలని అన్నార‌ని మెతుకు ఆనంద్ అన్నారు. మ‌రి ఆయ‌న‌పై కూడా రాజద్రోహం కేసు పెట్టాలా అని ప్ర‌శ్నించారు. 

ద‌ళితుల‌కు బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇప్పించే ద‌మ్ము బండి సంజ‌య్ కు ఉందా ? -ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
త‌మ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో రాజ్యాంగ స్ఫూర్తి ని అమలు చేయని కాంగ్రెస్, బీజేపీ లు ఇక్కడ మాత్రం రాజ్యాంగంపై ఎదో మాట్లాడారని ఆందోళన చేస్తున్నాయని ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్ (kranthi kiran) అన్నారు. ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్లు అమలు చేయ‌డం మానేసి, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి, దళితులను ఉద్యోగాల నుంచి కేంద్ర వెళ్ల‌గొడుతోంద‌ని ఆరోపించారు. ద‌ళితుల‌కు బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇప్పించే ద‌మ్ము బండి సంజ‌య్ (bandi sanjay)కు ఉందా అని ఆయ‌న స‌వాల్ విసిరారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీజేపీ లు చేస్తున్నప్రచారాన్ని దళితులు నమ్మొద్దని ఆయ‌న సూచించారు. సీఎం వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంట‌న్న కోణంలో చ‌ర్చ జ‌ర‌గాల‌ని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి