తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు.
100 రోజుల్లోగా క్వింటాలు ధాన్యంకు రూ.500 అదనంగా, అలాగే రూ.500 కే ఎల్పీజీ సిలిండర్ అందించే పథకాలను అందుబాటులోకి తీసుకొస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మంగళవారం ఆయన పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ 8 సీట్లు గెలిచాం.. 19 చోట్ల రెండో స్థానంలో నిలిచాం - ఈటల రాజేందర్
undefined
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంలో విఫలం కావడంతో పౌరసరఫరాల సంస్థ మొత్తం రుణాలు రూ.56 వేల కోట్లకు చేరాయని అన్నారు. వడ్డీ రూ.3 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు. కార్పొరేషన్ కు చెందిన రూ.18 వేల కోట్ల విలువైన 8.8 మిలియన్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఎలాంటి సెక్యూరిటీ, బ్యాంకు గ్యారంటీ లేకుండా పేరుకుపోయిందన్నారు.
సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే నెహ్రూపై బీజేపీ చర్చ - రాహుల్ గాంధీ..
ఈ పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి మంత్రివర్గంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవస్థాగత లోపాలు ఉన్నాయని ఆయన అన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు సరఫరా చేసే కిలో బియ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.39 ఖర్చు చేస్తున్నాయని అన్నారు. కాబట్టి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఇచ్చే బియ్యం అర్హులైన లబ్ధిదారులందరికీ చేరాలని మంత్రి స్పష్టం చేశారు.
2024 లోక్ సభ ఎన్నికలు.. నరేంద్ర మోడీ, బీజేపీదే పై చేయి.. ఇవిగో 5 కారణాలు..
కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వరకు ఉన్న రేషన్ కార్డుల్లో 12 శాతం కార్డుల లబ్దిదారులు బియ్యం తీసుకోవడం లేదని అన్నారు. చాలా కాలంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చించి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.