పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పిస్తాం.. ఆ మూడు పార్టీలది ర‌హ‌స్య ఒప్పందం: రాహుల్ గాంధీ

By Mahesh Rajamoni  |  First Published Oct 20, 2023, 11:16 PM IST

Telangana Congress: నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో జరిగిన వివిధ సభల్లో తెలంగాణ సెంటిమెంటును ప్రస్తావిస్తూ, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది తన తల్లి, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీయేనని, ఆమె మద్దతు ఇవ్వకపోతే కొత్త రాష్ట్రం ఏర్పడేది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అలాగే, "తెలంగాణలో పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంది. గతంలో బీజేపీ నేతలు బాలీవుడ్ హీరోల్లా ఇక్కడ తిరుగుతూ ఉండేవారు. తమ వాహనంలోని నాలుగు చక్రాలు పేలిపోయిన విషయాన్ని కూడా వారు గుర్తించలేదు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు. అది మాకు అక్కర్లేదు" అని అన్నారు.
 


Congres MP Rahul Gandhi: నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో జరిగిన వివిధ సభల్లో తెలంగాణ సెంటిమెంటును ప్రస్తావిస్తూ, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది తన తల్లి, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీయేనని, ఆమె మద్దతు ఇవ్వకపోతే కొత్త రాష్ట్రం ఏర్పడేది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అలాగే, "తెలంగాణలో పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంది. గతంలో బీజేపీ నేతలు బాలీవుడ్ హీరోల్లా ఇక్కడ తిరుగుతూ ఉండేవారు. తమ వాహనంలోని నాలుగు చక్రాలు పేలిపోయిన విషయాన్ని కూడా వారు గుర్తించలేదు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు. అది మాకు అక్కర్లేదు" అని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర మూడో రోజు కొనసాగుతున్న స‌మ‌యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు బీజేపీపై విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగించింది. జగిత్యాలలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు దోపిడీదారులకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివ‌ర్ణించారు. దోచుకున్న డబ్బులన్నీ బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయనీ, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం రహస్య పొత్తు పెట్టుకున్నాయని, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలవడానికి ఎంఐఎం సహకరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు చక్కెర కర్మాగారాలను ఏర్పాటు చేస్తామనీ, వరి ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పసుపు పంటకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Latest Videos

కుల గణనకు ప్రధాని మెడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించిన ఆయన బడ్జెట్ లో ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) నిధులు కేటాయించలేదని విమర్శించారు. తన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి, తన అధికారిక నివాసాన్ని విడిచిపెట్టారని గుర్తు చేసిన రాహుల్ గాంధీ.. బీజేపీ తనను నివాసం నుండి ఖాళీ చేయగలదని, కానీ ప్రజల హృదయాల నుండి కాదని అన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు బలమైన అనుబంధం ఉందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల గణన చేపడతామని చెప్పారు. వెనుకబడిన వారిని గుర్తించి, కుల గణన నిర్వహిస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు.

click me!