రజాకార్ సినిమాను నిలిపేయాలి.. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మూవీ: ఈసీ, సెన్సార్ బోర్డుకు సీపీఐ ఫిర్యాదు

By Mahesh K  |  First Published Oct 20, 2023, 10:07 PM IST

రజాకార్ సినిమాను నిలిపేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ ఎంపీ బోనాయ్ విశ్వం ఎన్నికల సంఘం, సెన్సార్ బోర్డులకు ఫిర్యాదు చేశారు. రజాకార్ సినిమా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నదని ఢిల్లీలో వారు చెప్పారు. బీజేపీ చరిత్రను వక్రీకరించాలని చూస్తున్నదని అన్నారు.
 


న్యూఢిల్లీ: రజాకార్ సినిమాపై సీపీఐ నేతలు ఆగ్రహించారు. ఈ సినిమా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నదని, తద్వార ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ సినిమాను నిలిపేయాలని కోరుతూ సీపీఐ ఎంపీ బోనాయ్ విశ్వం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణలు ఢిల్లీలో సెన్సార్ బోర్డు అధికారికి మెమోరాండం అందించారు. అలాగే, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.

రజాకార్ సినిమాతో బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తున్నారని నారాయణ ఢిల్లీలో విలేకరులతో అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సామాన్యులు చేసిన మహోన్నత పోరాటానికి విద్వేషం అంటగట్టుతున్నారని, కుల, మత, వర్గ, వర్ణ, లింగ బేధాలు లేకుండా ప్రజలు భాగస్వామ్యం పంచుకున్న పోరుకు మతం రంగు పులుముతున్నారని ఆరోపించారు.

Latest Videos

undefined

Also Read: ఇంకా వెనక్కి రాని రూ. 10,000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు: ఆర్బీఐ

బీజేపీకి మూల బీజమైన ఆర్ఎస్ఎస్ నాడు బ్రిటీష్, నైజాంలను సమర్థించిందని, నేడు మాత్రం విద్వేషాలు రెచ్చగొట్టే ఎజెండాతో పని చేస్తున్నదని నారాయణ ఆరోపించారు. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాకు ఫైనాన్స్ చేశారని తెలిపారు. సాయుధ పోరాటాన్ని బీజేపీ ఒక విముక్తి పోరాటంగా చూస్తున్నదని, ఇలాంటి ప్రయత్నాల వల్ల చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు.

click me!