కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్ లో పోరాటం: కేశవరావు

By narsimha lode  |  First Published Jan 31, 2023, 12:47 PM IST

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్ లో ఎండగడుతామని  బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు  చెప్పారు. 


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక  నిర్ణయాలను  పార్లమెంట్ లో ఎండగడుతామని  బీఆర్ఎస్ ఎంపీ  కె.కేశవరావు  చెప్పారు.   పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ప్రసంగాన్ని  బీఆర్ఎస్, ఆప్  పార్టీలు బహిష్కరించాయి.   రాష్ట్రపతి ప్రసంగం  తర్వాత  కేశవరావు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తో కలిసి  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  ప్రజాస్వామ్య పద్దతిలో  తమ నిరసన ఉంటుందన్నారు.   కేంద్ర ప్రభుత్వం  నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా తమ వైఖరిని  చెప్పిన విషయాన్ని కేశవరావు గుర్తు  చేశారు.   తెలంగాణ, తమిళనాడు , కేరళలలో  గవర్నర్లతో  ఆయా రాష్ట్రాలు  ఏ రకంగా  ఇబ్బంది పడుతున్నాయో కేశవరావు  ఈ సందర్భంగా గుర్తు  చేశారు. గవర్నర్ల వ్యవస్థపై  పార్లమెంట్ లో  చర్చ జరగాల్సిన అవసరం ఉందని  కేశవరావు  అభిప్రాయపడ్డారు.  

అదానీ గ్రూప్ నకు చెందిన  అధికారిక పాస్ పోర్టులను సీజ్ చేయాలని  ఆప్ ఎంపీ సంజయ్ సింగ్  డిమాండ్  చేశారు. దేశ ప్రజల సొమ్మును ఒక వ్యక్తికి  కట్టబెడుతున్నారని ఆయన  ఆరోపించారు.  బీజేపీకి చందాలిచ్చే వ్యక్తులకు  ప్రయోజనం కలిగించేలా  కేంద్రం వ్యవహరిస్తుందని  సంజయ్ సింగ్  విమర్శించారు.  దేశంలో జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు జరిపించాలని  ఆయన కోరారు.  అదానీ గ్రూప్   పార్లమెంటరీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు  చేయాలని ఆయన కోరారు.   కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో  నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా  పెరిగాయన్నారు. 
 

Latest Videos

click me!