సిరిసిల్ల జిల్లాలో స్కూల్​ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు

Published : Jan 31, 2023, 11:13 AM IST
సిరిసిల్ల జిల్లాలో స్కూల్​ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు

సారాంశం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును వెనక నుంచి ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును వెనక నుంచి ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో స్కూల్ బస్‌లోని పలువురు విద్యార్థులకు గాయాల‌య్యాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక, ఆర్టీసీ బస్సు కరీంనగర్ డిపోకు చెందినది కాగా, స్కూల్ బస్సు  విజ్ఞాన్ స్కూల్‌కు చెందినది. బ‌స్సు వేగంగా ఢీ కొట్ట‌డంతో స్కూల్ బ‌స్సులోని పిల్ల‌లు తీవ్ర భయాందోళన చెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన విద్యార్థులను ఆస్పత్రులకు తరలించారు. విష‌యం తెలిసిన వెంట‌నే విద్యార్థుల త‌ల్లిదండ్రులు, స్కూల్ యాజ‌మాన్యం భయంతో ప్రమాదం జరిగిన చోటుకు, ఆస్పత్రులకు చేరుకున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ అనురాగ్.. అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.  

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే