జూలై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని వైఎస్ షర్మిల ప్రకటించారు.
హైదరాబాద్: జూలై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని వైఎస్ షర్మిల ప్రకటించారు. బుధవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ విధానాలు ఉంటాయని ఆమె చెప్పారు. ప్రతి తెలంగాణ బిడ్డ మన ఎజెండా చూసి మెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
also read:జులై 8న వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ: అభ్యంతరం లేదని వైఎస్ విజయమ్మ లేఖ
జూలై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని వైఎస్ షర్మిల ప్రకటించారు.బుధవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. pic.twitter.com/p0MI6sm5Op
— Asianetnews Telugu (@AsianetNewsTL)
undefined
కార్యకర్తలు చెప్పిందే సిద్దాంతమన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని ఆమె హామీ ఇచ్చారు.కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులుగా నిలబడతారని ఆమె అభిప్రాయపడ్డారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డితో లబ్ది పొందని ఇల్లు తెలంగాణలో లేదని ఆమె చెప్పారు. నాయకులను నిత్యం ప్రజల వద్దకు తీసుకెళ్లేవారే కార్యకర్తలని ఆమె తెలిపారు.
జెండాలు మోయడంతో పాటు జనం గుండె చప్పుడు విని అజెండాలు రాసే వాళ్లే కార్యకర్తలని ఆమె అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ పనిచేస్తోందని ఆమె చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున పార్టీని ఆమె ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని షర్మిల ప్రకటించారు.