కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు

Published : Jun 09, 2021, 10:33 AM ISTUpdated : Jun 09, 2021, 11:29 AM IST
కరోనా ఎఫెక్ట్:  తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు

సారాంశం

తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. 

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేసింది. టెన్త్ పరీక్షలను కూడ ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేసిన సమయంలో  కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని జూన్ మాసంలో సమీక్ష చేసి నిర్ణయం తీసుకొంటామని ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది. 

also read:కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు యోచన?

ఈ ఏడాది జూలై మాసంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను  నిర్వహించాలని బోర్డు తొలుత ప్రతిపాదించింది. సగం పరీక్ష పేపర్ ద్వారా విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుండి  సగానికి కుదించాలని భావించారు.అయితే రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే సెకండియర్ పరీక్షలను నిర్వహిస్తే కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. దీంతో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా తెలంగాణ సర్కార్ బుధవారం నాడు ప్రకటించింది. 

తెలంగాణ రాష్ట్రంలో 4.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలకు ఫీజు కట్టారు. వీరంతా కూడ ఉత్తీర్ణులైనట్టేనని  ప్రభుత్వం తెలిపింది. ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు ఫస్టియర్ లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైనవారు కూడ ఉన్నారు. ఫస్టియర్ బ్యాక్‌లాగ్ ఉన్న విద్యార్థులు 1.91 వేల మంది ఉన్నారు. అయితే బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులకు పాస్ మార్కులు వేయనున్నారు.సెకండియర్ వార్షిక పరీక్షల్లో  మార్కుల కేటాయింపు విషయమై ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం మార్కులను కేటాయించనుంది.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu