గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండు స్థానాల్లో పోటీ: తేల్చేసిన కోదండరామ్

By narsimha lodeFirst Published Sep 29, 2020, 4:35 PM IST
Highlights

వచ్చే ఏడాది జరగనున్న  రెండు పఠ్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీ చేస్తామని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ప్రకటించారు.మంగళవారం నాడు టీజేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం హన్మకొండలో జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న కోదండరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న  రెండు పఠ్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీ చేస్తామని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ప్రకటించారు.మంగళవారం నాడు టీజేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం హన్మకొండలో జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న కోదండరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

టీఆర్ఎస్ నేతల కోసమే ప్రైవేట్ యూనివర్శిటీలను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు.

also read:ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్‌కి మద్దతుపై కొనసాగుతున్న సస్పెన్స్: ఒంటరి పోరుకే కాంగ్రెస్ నేతల మొగ్గు

నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ రెండు స్థానాల్లో పోటీ చేయాలని టీజేఎస్ నిర్ణయం తీసుకొంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుండి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీని టీజేఎస్ కోరింది. అయితే మెజారిటీ కాంగ్రెస్ నేతలు టీజేఎస్ కు మద్దతివ్వడాన్ని వ్యతిరేకించారు.

టీజేఎస్ కు మద్దతిచ్చే విషయమై కాంగ్రెస్ పార్టీ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోనుంది. 
 

click me!