వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం: మాణికం ఠాగూర్

By narsimha lodeFirst Published Oct 2, 2020, 3:30 PM IST
Highlights

2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ  మాణికం ఠాగూర్ ధీమాను వ్యక్తం చేశారు. 

సంగారెడ్డి: 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ  మాణికం ఠాగూర్ ధీమాను వ్యక్తం చేశారు. 

శుక్రవారంనాడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ పాల్గొన్నారు.

also read:జగ్గారెడ్డికి మంత్రి పదవి: ఠాగూర్, ట్విస్టిచ్చిన తూర్పు జయప్రకాష్ రెడ్డి

తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత ధనిక కుటుంబంగా కేసీఆర్ కుటుంబం మారిందని ఆయన ఆరోపించారు. వెయ్యి, రెండు వేలకు ఓట్లు అమ్ముకోవద్దన్నారు. కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మోడీ, అమిత్ షాలు రైతులను అంబానీ చేతుల్లో పెట్టారని ఆయన ఆరోపించారు. మోడీని ఓడించే సత్తా కేవలం రాహుల్ గాంధీకే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐక్యంగా పనిచేస్తే కాంగ్రెస్ ఎవరినైనా ఓడించగలదని ఆయన స్పష్టం చేశారు.టీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అని ఆయన విమర్శించారు. రైతులు పండించిన ధరలను ఇంట్లో కూర్చొని అదానీ, అంబానీలు నిర్ణయిస్తారన్నారు. 
 

click me!