దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పోకిరీల హంగామా, ప్రయాణికుల తిప్పలు

Siva Kodati |  
Published : Oct 02, 2020, 02:29 PM IST
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పోకిరీల హంగామా, ప్రయాణికుల తిప్పలు

సారాంశం

హైదరాబాద్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పోకిరిల హంగామా ప్రయాణీకులకు ఇబ్బందికరంగా తయారైంది. కేబుల్ బ్రిడ్జిపై అడ్డదిడ్డంగా తిరుగుతున్నారు పోకిరీలు.

హైదరాబాద్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పోకిరిల హంగామా ప్రయాణీకులకు ఇబ్బందికరంగా తయారైంది. కేబుల్ బ్రిడ్జిపై అడ్డదిడ్డంగా తిరుగుతున్నారు పోకిరీలు.

డివైడర్‌ను తాకి రోడ్డు బ్రిడ్జి అంచుల వరకు వెళ్లిపోతున్నారు యువకులు. వేగంగా వస్తున్న వాహనాల మధ్య అడ్డదిడ్డంగా వెళుతున్నారు. సెల్ఫీల కోసం కేబుల్ బ్రిడ్జిపై యువకుల హంగామా ప్రమాదకరంగా తయారైంది.

రహదారి మధ్యలోకి రావొద్దని పోలీసులు చేస్తున్న సూచనలను బేఖాతరు చేస్తున్నారు. మరోవైపు కేబుల్ బ్రిడ్జిపై సందర్శకుల సెల్ఫీలు ప్రమాదకరంగా మారాయి. యువత, మహిళలు రోడ్డుకి అడ్డంగా నిల్చొని మరి సెల్ఫీలు దిగుతున్నారు.

ఇప్పటికే బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాకపోకల్ని నిషేధించారు. వారాంతాల్లో సందడి పెరుగుతోంది. సెల్ఫీలపై మోజుతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు