ఈ నెల 6వ తేదీన వరంగల్ లో నిర్వహించే రాహుల్ గాంధీ సభతో వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటిస్తామని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
వరంగల్: ఈ నెల 6వ తేదీన రైతులకు ఏం చేస్తామనే విషయమై వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటిస్తామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు Uttamkumar Reddy ప్రకటించారు.ఈ నెల 6వ తేదీన వరంగల్ లో జరిగే Rahul Gandhi సభ ఏర్పాట్లను టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి పంట నష్ట పరిహారం అందని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. Telangana రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వరంగల్ సభ ద్వారా Congress పార్టీ హయంలో ఏ రకమైన పథకాలు అమలు చేసిన విషయాన్ని వివరించనున్నట్టుగా ఆయన చెప్పారు. అంతేకాదు BJP, TRSలు ఏ రకంగా రైతులను మోసం చేశాయో కూడా వివరించనున్నట్టుగా చెప్పారు. రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయనుందనే విషయాలను Warangal సభ ద్వారా రాహుల్ గాంధీ ప్రకటిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది Sonia Gandhi అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల గుండెల్లో సోనియా గాంధీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాహుల్ గాంధీ హైద్రాబాద్ లోని Osmania university ని సందర్శిస్తానంటే KCR కు ఎందుకు భయమని ఆయన ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్శిటీ వీసీ రవీందర్ తో తాను నిన్న పోన్ లో మాట్లాడినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఓయూ అటానమస్ బాడీ అని ఆయన గుర్తు చేశారు.రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గదని కూడా తాను రవీందర్ ను కోరినట్టుగా చెప్పారు. ఓయూలో తాము రాజకీయ సభ ప్లాన్ చేయలేదని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఉస్మానియా యూనివర్శిటీని సందర్శించడంతో పాటు విద్యార్ధులతో ముఖాముఖి కోసమేనన్నారు. ఓయూకి రాహుల్ వస్తే లాభమన్నారు. ఈ యూనివర్శిటీలో టీచింగ్ స్టాఫ్ సగానికి సగం తగ్గిపోయారన్నారు.ఓయూలో రాహుల్ టూర్ కి అనుమతివ్వాలని ఆయన కోరారు. 2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సభ తొలి మెట్టుగా తాను భావిస్తున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలు ఆలస్యం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.