బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉంంది: కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ

By narsimha lodeFirst Published Oct 5, 2022, 5:03 PM IST
Highlights

కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు ప్రారంభించిన బీఆర్ఎస్ లో తాము భాగస్వామ్యులు కావడం గర్వంగా ఉందని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ చెప్పారు. 


హైదరాబాద్:బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో తాము భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ చెప్పారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం  ఇవాళ తీర్మానం చేసింది.ఈ సమావేశానికి కేసీఆర్ ఆహ్వానం మేరకు జేడీఎస్ నేత కుమారస్వామి , ఆ పార్టీ ఎమ్మెల్యేలు హైద్రాబాద్ కు వచ్చారు. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కుమారస్వామి  సహా ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ప్రగతి భవన్  వద్ద మీడియాతో మాట్లాడారు. 

బీఆర్ఎస్ కు తమ  సంపూర్ణ మద్దతు ఉంటుందని నిఖిల్ గౌడ చెప్పారు.  కేసీఆర్ కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉందన్నారు. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ను ఏర్పాటు చేయడాన్నిఆయన స్వాగతించారు. దళితబంధు, రైతు బంధు వంటి పథకాలు రాష్ట్రంలో ప్రజలకు మంచి ఫలితాలను అందిస్తున్నాయన్నారు.  తమది రైతుల పార్టీ అని నిఖిల్ గౌడ గుర్తుచేశారు.  రైతుల సంక్షేమమే ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు మాస్ పథకాలని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయి వరకు ఈ పథకాలు వెళ్లాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టుగా  నిఖిల్ గౌడ తెలిపారు.  తమకు కేసీఆర్ కొన్ని మంచి సలహలు ఇచ్చారన్నారు. కర్ణాటకలో కేసీఆర్  బహిరంగ సభల ఏర్పాటు గురించి ఇంకా చర్చించలేదన్నారు. 

also read:టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం: ఈసీని కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు

రెండు మాసాల క్రితమే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలంగాణ సీఎం కేసీఆర్ తో హైద్రాబాద్ ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ తో కలిసి నడుస్తామని కుమారస్వామి ప్రకటించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు కుమారస్వామి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిన్నరాత్రే హైద్రాబాద్ కు వచ్చారు. తమిళనాడుకు చెందిన వీఎల్ సీ పార్టీ చీఫ్ తిరుమలవలన్  ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
 

click me!