
హైదరాబాద్: BJP వ్యతిరేక పోరాటంలో TRS కు తాము మద్దతిస్తామని CPI జాతీయ కార్యదర్శి డాక్టర్ Narayana చెప్పారు.శుక్రవారం నాడు Hyderabad మగ్ధూం భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగంపై ఇటీవల తెలంగాణ సీఎం KCR చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.. బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో టీఆర్ఎస్ తో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ నేత నారాయణ తేల్చి చెప్పారు.
ఎంఐఎం చీఫ్ Asaduddin Owaisiపై జరిగిన కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.
కేంద్రం ప్రవేశ పెట్టిన Budget 2022 తో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కార్పోరేట్ శక్తులకు ఉపయోగపడేలా ఈ బడ్జెట్ ఉందని ఆయన విమర్శించారు. ఈ బడ్జెట్ తో కార్పోరేట్ శక్తులకు మాత్రమే పనికొస్తుందన్నారు. వ్యవసాయానికి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత లేదన్నారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఈ బడ్జెట్ ను ప్రతిపాదించారని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేసిన రైతులపై కోపంతో బడ్జెట్ లో వ్యవసాయానికి కేటాయింపులు చేయలేదని ఆయన విమర్శించారు.బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నారాయణ సమర్ధించారు.
దేశంలో బీజేపీ వ్యతిరేకంగా ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. 2018 లో ఫెడరల్ ఫ్రంట్ కోసం కూడా కేసీఆర్ ప్రయత్నించారు.కానీ ఈ ఫ్రంట్ ఆచరణలోకి రాలేదు. కానీ మరోసారి బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకండా ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు తమిళనాడు, బెంగాల్ సీఎంలతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఏడాది చివర్లో హైద్రాబాద్ కు వామపక్షాల నేతలు వచ్చిన సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రదాన కార్యదర్శి డి. రాజాలు కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు. అంతేకాదు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా సమావేశమయ్యారు.