మునుగోడులో ఉన్న 42 మంది స్థానికేతరుల్ని బయటకు పంపించి వేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు చెప్పారు.
హైదరాబాద్:మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 42 మంది స్థానికేతరుల్ని పంపించివేశామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు చెప్పారు.గురువారంనాడు మధ్యాహ్నం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడులో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని ఆయన చెప్పారు.ఓటు వేయడానికి డబ్బు ఇచ్చినా తీసుకున్నా కూడ నేరమేనని వికాస్ రాజు చెప్పారు.ఇవాళ ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ నమోదైందని ఆయన చెప్పారు.ఫేక్ న్యూస్ పై కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఫిర్యాదు చేశారని వికాస్ రాజు చెప్పారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మాక్ పోలింగ్ సమయంలో ఆరు చోట్ల ఈవీఎంలలో సమస్య తలెత్తే వాటిని సరిచేసినట్టుగా ఆయన వివరించారు. మాక్ పోలింగ్ తర్వాత ఐదు చోటల్ల ఈవీఎంలలో సమస్యలు వస్తే వాటిని సరిచేసినట్టుగా వికాస్ రాజు వివరించారు.దీంతో 30 నుండి 45 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయిందని ఆయన వివరించారు.
మర్రిగూడలో రెండు పార్టీల కార్యకర్తల ఘర్షణలు చోటు చేసుకున్నాయన్నారు. నియోజకవర్గంలోని 38 చోట్ల వచ్చిన ఫిర్యాదులపై చెక్ చేసినట్టుగా ఆయన చెప్పారు. ఇవాళ రూ.2.99 లక్షలనగదును సీజ్ చేసినట్టుగా వికాస్ రాజు వివరించారు. సుమారు 42 మంది స్థానికేతరులను పంపించివేసినట్టుగా ఆయన వివరించారు.
also read:చిన్నకొండూరులో మొరాయించిన ఈవీఎం: పోలింగ్ కేంద్రంలోనే కూర్చున్న ఓటర్లు
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.