రెగ్యులర్ రోస్టర్‌లో భాగమే క్వారంటైన్:నిలోఫర్ సూపరింటెండ్

By narsimha lode  |  First Published Apr 19, 2020, 4:00 PM IST

రెగ్యులర్ రోస్టర్‌లో భాగంగానే నిలోఫర్ లో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆసుపత్రి సూపరింటెండ్ మురళీ కృష్ణ ప్రకటించారు.
 


హైదరాబాద్: రెగ్యులర్ రోస్టర్‌లో భాగంగానే నిలోఫర్ లో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆసుపత్రి సూపరింటెండ్ మురళీ కృష్ణ ప్రకటించారు.

ఈ ఆసుపత్రిలో చికిత్స పొందిన రెండు మాసాల బాలుడికి కరోనా పాజిటివ్ రావడంతోనే వైద్య సిబ్బందిని క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రచారం సాగడంతో ఈ విషయమై ఆయన ఆదివారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.

Latest Videos

undefined

ప్రభుత్వ ఆదేశాల మేరకు పది రోజుల పాటు డ్యూటీ తర్వాత వైద్య సిబ్బందికి క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. అత్యవసర విధుల్లో ఉన్నవారికి పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్కులు అందిస్తున్నామని ఆయన తెలిపారు. 

also read:రెండేళ్ల బాలుడికి కరోనా: క్వారంటైన్‌కి 200 మంది నిలోఫర్ సిబ్బంది

ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ రోగులు ఎవరూ కూడ చికిత్స తీసుకోవడం లేదని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 803 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఈ నెల 20వ తేదీ నుండి ఆంక్షలు సడలించాలా వద్దా అనే అంశంపై ఆదివారం నాడు తెలంగాణ కేబినెట్ సమావేశమై చర్చిస్తోంది. 

click me!