సైరన్ సౌండ్‌తో కొడుకు ప్రయాణం: అడ్డుకొన్న పోలీసులపై ఎంపీ చిందులు

By narsimha lodeFirst Published Apr 19, 2020, 1:33 PM IST
Highlights

నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు, పోలీసులపై ఆదివారం నాడు చిందులు తొక్కారు. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు తనయుడు జడ్పీటీసీగా ఉన్నాడు. తాను ప్రయాణం చేస్తున్న వాహనంలో సైరన్ వేసుకొని ప్రయాణం చేయడంపై పోలీసులు చెక్ పోస్టు వద్ద అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు, పోలీసులపై ఆదివారం నాడు చిందులు తొక్కారు. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు తనయుడు జడ్పీటీసీగా ఉన్నాడు. తాను ప్రయాణం చేస్తున్న వాహనంలో సైరన్ వేసుకొని ప్రయాణం చేయడంపై పోలీసులు చెక్ పోస్టు వద్ద అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

నాగర్ కర్నూల్  ఎంపీ పి. రాములు తనయుడు ఆదివారం నాడు వాహనంలో సైరన్ వేసుకొని పోలీస్ చెక్ పోస్టు వద్దకు చేరుకొన్నాడు. దీంతో పోలీసులు అతడి వాహనాన్ని ఆపారు. సైరన్ ఎందుకు వేసుకొన్నావని ఆయనను ప్రశ్నించారు.  అంతేకాదు ఈ వాహనంలో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ విషయాన్ని కూడ పోలీసులు ప్రశ్నించారు.

ఈ విషయాన్ని తెలుసుకొన్న ఎంపీ పి. రాములు గన్ మెన్లను తీసుకొని చెక్ పోస్టు వద్దకు చేరుకొన్నారు. ఈ విషయమై ఎఎస్ఐ శ్రీరామ్ రెడ్డితో ఎంపీ వాగ్వాదానికి దిగారు. తన కొడుకు జడ్పీటీసీ అంటూ కూడ ఎంపీ రాములు గుర్తు చేశారు.

also read:రెండేళ్ల బాలుడికి కరోనా: క్వారంటైన్‌కి 200 మంది నిలోఫర్ సిబ్బంది

నిబంధనలకు విరుద్దంగా వాహనంలో ప్రయాణిస్తున్న విషయాన్ని తాము గుర్తు చేశామని పోలీసులు గుర్తు చేశారు. మరో వైపు తన రాజకీయ జీవితంలో తప్పుడుగా పనిచేసినట్టుగా లేదని ఎంపీ రాములు గుర్తు చేశారు.

అయితే చట్టాలు చేసే వాళ్లే చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా అని పోలీసులు ప్రశ్నించారు. చెక్ పోస్టు వద్ద ఎంపీ తనయుడు ప్రయాణీస్తున్న వాహనాన్ని తాను నిలిపివేయలేదని ఎఎస్ఐ శ్రీరాం రెడ్డి ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు మాస్క్ పెట్టుకోకుండా బయటకు ఎలా వచ్చారని ఎంపీ రాములును పోలీసులు ప్రశ్నించారు. మీ తనయుడిని తాము ఏమీ అనలేదని పోలీసులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. కొద్దిసేపు పోలీసులు, ఎంపీ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకొంది.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు చేస్తున్న పనిని తాము అభినందిస్తున్న విషయాన్ని ఎంపీ రాములు గుర్తు చేశారు. 


 

click me!