రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకొంటాం: ఏపీకి కేసీఆర్ హెచ్చరిక

By narsimha lodeFirst Published Mar 26, 2021, 3:43 PM IST
Highlights

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్  శుక్రవారం నాడు ప్రసంగించారు.  ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన సభలో గుర్తు చేశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని చెప్పారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లి పోరాటం చేస్తామని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి హక్కుల విషయంలో రాజీ లేదన్నారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై స్టేలు కూడ ఉన్నాయన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందన్నారు. కోర్టులు కూడ కొన్ని ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన తెలిపారు.

also read:ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను పెంచుతాం: కేసీఆర్

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం .జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదన్నారు. 

ఆర్డీఎస్ వద్ద కుడికాలువ నిర్మిస్తే రాష్ట్రానికి నష్టమన్నారు. కృష్ణా నదిలో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గోదావరిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి... ఈ నీటిని రెండు రాష్ట్రాలు వాడుకొందామని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కానీ ఏపీ రాష్ట్రం పాత పద్దతిలోనే పోతోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఇవాళ దిక్కులేని స్థితిలో లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అరాచకం జరగనివ్వబోమని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర నీటి వాటాల విషయంలో హక్కులను వదులుకోమని ఆయన తేల్చి చెప్పారు.

ఆర్డీఎస్ లో 15.9 టీఎంసీలను రాష్ట్రం దక్కించుకొంటుందని కేసీఆర్ ప్రకటించారు.వాటాను వదులుకోబోమన్నారు. ఈ విషయమై కర్ణాటక రాష్ట్రానికి ప్రతినిధి బృందం వెళ్తుందన్నారు.

click me!