అనాధ పిల్లలను ప్రభుత్వమే ఆదుకొంటుంది: టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్

By narsimha lodeFirst Published Oct 25, 2021, 5:02 PM IST
Highlights


అనాధ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతుగా కేసీఆర్ ప్రసంగించారు.

హైదరాబాద్: అనాధ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ సీఎం Kcr ప్రకటించారు.సోమవారం నాడు Trs ప్లీనరీ సమావేశంలో  మంత్రి సత్యవతి రాథోడ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి కొనసాగింపుగా ఆయన కొద్దిసేపు ప్రసంగించారు.ఒక రోజు తన వద్దకు orphan పిల్లలు వచ్చారన్నారు.  ఆ పిల్లలతో మాట్లాడిన సందర్భంలో ఆ పిల్లలు లేవనెత్తిన ప్రశ్నలతో ఆ రోజు తనకు నిద్ర పట్టలేదన్నారు. దీంతో అనాధ పిల్లలను ఆదుకొనే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని భావించినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు.ఈ విషయమై మంత్రి Satyavathi Rathod నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

also read:ఏపీ ప్రజలూ అడుగుతున్నారు.. ఈసీ పరిధి దాటింది: దళితబంధుపై కేసీఆర్

మహిళలు ఎక్కడ పూజింపబడుతారో అక్కడ రాజ్యం బాగుంటుందన్నారు కేసీఆర్., మహిళలు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.రాష్ట్రంలో అనాధ పిల్లలు ఎక్కడున్నా వారిని ప్రభుత్వం ఆదుకొంటుందని ఆయన హామీ ఇచ్చారు. అనాధ పిల్లల గురించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజాప్రతినిధులను కోరారు. ప్రజల కోసం టీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలను చేస్తోందని ఆయన వివరించారు.

.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీ పెద్దలు ఎలా చెబితే అలా వింటారన్నారు. కానీ ప్రజలకు ఏం అవసరమో తాము చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ కు చట్టబద్దంగా రూ. 425 కోట్ల విరాళాలు అందాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి తాను శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని ఆయన చెప్పారు.
 

click me!