జమ్మికుంట సీఐపై ఈసీ బదిలీ వేటు: ట్రాఫిక్‌ సీఐకి బాధ్యతలు

By narsimha lodeFirst Published Oct 25, 2021, 4:35 PM IST
Highlights

జమ్మికుంట సీఐ రామచంద్రరావుపై ఈసీ బదిలీ వేటేసింది. రామచంద్రరావు స్థానంలో ట్రాఫిక్ సీఐ తిరుమలగౌడ్ ను నియమించింది. రామచంద్రరావును తక్షణమే రిలీవ్ కావాలని ఆదేశించింది.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా Jammikunta సీఐ  రామచంద్రరావుపై ఈసీ బదిలీ వేటు వేసింది. రామచంద్రరావుపై ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి.ఈ ఫిర్యాదుల ఆధారంగా ఈసీ ఆయనపై బదిలీ వేటేసింది.హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జమ్మికుంట మండలం ఉంది. జమ్మికుంట సీఐ Ramachandra raoపై ఈసీకి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఆయనను బదిలీ చేస్తూ Election Commission నిర్ణయం తీసుకొంది.  రామచంద్రరావును తక్షణమే విధుల నుండి రిలీవ్ కావాలని ఈసీ ఆదేశించింది. రామచంద్రరావు స్థానంలో ట్రాఫిక్ సీఐ గుర్రం తిరుమల గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

also read:Huzurabad Bypoll : బిజెపీ రెచ్చగొట్టి కయ్యానికి కాలుదువ్వుతోంది.. ఈసీకి ఫిర్యాదు.. పల్లా (వీడియో)

 హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జూన్ 12వ తేదీన హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి Etela Rajender రాజీనామా చేశారు.దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.ఇప్పటికే ఈ అసెంబ్లీ స్థానంలో దళితబంధు పథకాన్ని ఈసీ నిలిపివేసింది. ఈ విషయమై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.Trsచీఫ్ ,తెలంగాణ సీఎం  Kcr ఈసీపై ఇవాళ విమర్శలు చేశారు. ఈసీ తీరును తప్పుబట్టారు. తన సభపై కూడా ఈసీ ఆంక్షలు పెట్టారని ప్లీనరీ లో చెప్పారు.


 

click me!