రాజ్ భవన్ లో జరిగే ఎట్ హోం కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నట్టుగా సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. గవర్నర్ వ్యవస్థ కడుపులో గడ్డలాంటిందన్నారు.
హైదరాబాద్: రాజ్ భవన్ లో ఇవాళ జరిగే ఎట్ హోం కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు.గురువారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎట్ హోం కార్యక్రమానికి రావాలని గవర్నర్ కార్యాలయం నుండి తమకు ఆహ్వానం అందిందని కూనంనేని సాంబశివరావు చెప్పారు. కడుపులో గడ్డలాంటింది గవర్నర్ వ్యవస్థ అని ఆయన చెప్పారు. గవర్నర్ వ్యవస్థ చీడ పురుగులాంటిందని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు, నివేదిక పంపా: కేసీఆర్ సర్కార్ పై గవర్నర్ తమిళిసై
గవర్నర్ మాట్లాడే మాటలకు విలువ లేదని ఆయన చెప్పారు.ప్రజా సమస్యలపై పోరాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. బీజేపీని వ్యతిరేకించేందుకే బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామన్నారు.తెలంగాణలో గవర్నర్ తీరుపై సీపీఐ గతంలో పోరాటం చేసింది.గవర్నర్ తమిళిసై విమర్శలు చేసింది ఆ పార్టీ. అంతేకాదు రాజ్ భవన్ ముట్టడికి కూడా సీపీఐ ప్రయత్నించింది.