సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నాం: పోసాని ఇంటిపై రాళ్లదాడిపై జాయింట్ సీపీ శ్రీనివాసరావు

By narsimha lodeFirst Published Sep 30, 2021, 2:12 PM IST
Highlights

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి నివాసంపై దాడి ఘటనకు సంబంధించి సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ జాయింట్ సీపీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాడు రాత్రి పోసాని కృష్ణ మురళి ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

హైదరాబాద్: సీసీ కెమెరాల ఆధారంగా పోసాని కృష్ణ మురళి ఇంటిపై దాడి కేసును దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ జాయింట్ సీపీ  శ్రీనివాస్ తెలిపారు.గురువారం నాడు ఆయన ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. బుధవారం నాడు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని  జాయింట్ సీపీ చెప్పారు.

also read:బూతులు తిడుతూ రాళ్ల దాడి: పోసాని కృష్ణ మురళి ఇంటిపై దాడిపై వాచ్‌మెన్ భార్య

పోసాని కృష్ణ మురళి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.  కొంత కాలంగా ఈ ఇంట్లో పోసాని కృష్ణ మురళి ఉండడం లేదని ఆయన చెప్పారు. ప్రెస్ క్లబ్ లో దాడికి యత్నించిన కేసులో దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ సీపీ చెప్పారు.తనకు ఏం జరిగినా కొందరే కారణమని పోసాని కృష్ణ మురళి చెప్పారని జాయింట్ సీపీ తెలిపారు.

ఈ ఘలనకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను నిరసిస్తూ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో  జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.


 

click me!