వరంగల్ పోలీసుల నుండి అనుమతి రాకపోవడంతో వైఎస్ షర్మిల తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. పాదయాత్రకు అనుమతిని కోరుతూ వైఎస్ఆర్‌టీపీ నేతలు ధరఖాస్తు చేసుకున్నారు. అయితే శనివారం నాడు రాత్రి వైఎస్ఆర్‌టీపీ నేతలకు పోలీసులు షోకాజ్ నోటీసులు పంపారు.
వరంగల్: పోలీసుల నుండి అనుమతి రాకపోవడంతో ఇవాళ్టి నుండి ప్రారంభం కావాల్సిన వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర వాయిదా పడింది. ఈ పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.ఈ మేరకు శనివారం నాడు అర్ధరాత్రి వైఎస్ఆర్‌టీపీ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గతంలో పాదయాత్రకు అనుమతిచ్చిన సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు పేీర్కొన్నారు. ఈ పాదయాత్రకు అనుమతి కోరుతూ వైఎస్ఆర్‌టీపీ నేతలు శనివారం నాడు పోలీసులకు ధరఖాస్తు చేసుకున్నారు. అయితే పాదయాత్రకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. అంతేకాదు శనివారం నాడు రాత్రి వరంగల్ పోలీసులు వైఎస్ఆర్‌టీపీకి షోకాజ్ నోటీసులు పంపారు. గతంలో పాదయాత్రకు అనుమతిని ఇస్తే వ్యక్తిగత విమర్శలు చేసి ఉద్రిక్తతకు కారణమయ్యారని పోలీసులు గుర్తు చేస్తున్నారు.దీంతో ఇవాళ ప్రారంభం కావాల్సిన పాదయాత్రను వైఎస్ఆర్‌టీపీ నేతలు వాయిదా వేసుకున్నారు. కొద్దిసేపట్లో నేతలతో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ కానున్నారు.పాదయాత్ర అనుమతిపై పోలీసులు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై చర్చించనున్నారు.పాదయాత్ర పున: ప్రారంభించడంపై చర్చిస్తారు. ఈ విషయమై అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్దం కావాలని కూడా షర్మిల భావిస్తున్నారు.
నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలం లింగగిరి నుండి పాదయాత్రను ప్రారంభించాలని వైఎస్ఆర్‌టీపీ తలపెట్టింది. పాదయాత్ర పున: ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ పోలీసులు అనుమతివ్వకపోవడంతో పాదయాత్రకు బ్రేక్ వేశారు.మరో వైపు నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామంలో టీఆర్ఎస్ నేతలు ఇవాళ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి కూడా పోలీసులు అనుమతినివ్వలేదు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
undefined
గత నెల 28న నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని లింగగిరిలో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 27న నర్సంపేట ఎమ్మెల్యేల పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత విమర్శలపై టీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఈ వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేకపోతే పాదయాత్రను అడ్డుకొంటామని వార్నింగ్ ఇచ్చాయి. లింగగిరిలో షర్మిల బస్సుకు టీఆర్ఎస్ శ్రేణులు నిప్పంటించాయి. వైఎస్ఆర్‌టీపీ వాహనాలపై దాడికి దిగారు. షర్మిలను అరెస్ట్ చేసి హైద్రాబాద్ లోటస్ పాండ్ కు తరలించారు.
also read:తెలంగాణానా ఆఫ్ఘనిస్తానా, కేసీఆర్ ఓ తాలిబన్: మద్దతిచ్చినవారికి షర్మిల ధన్యవాదాలు
గత నెల 29న లోటస్ పాండ్ నుండి ప్రగతి భవన్ వద్ద ధర్నాకు వెళ్లిన షర్మిలను పంజాగుట్టలో పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఆమెను తరలించారు.
దీంతో వైఎస్‌ఆర్‌టీపీ నేతలు పాదయాత్రకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే వరంగల్ పోలీసులు మాత్రం ఆమె పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు.