
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ రిజెక్ట్‌ను సవాల్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం... ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్ట్ సెప్టెంబర్ 16కి వాయిదా వేసింది.
కాగా.. విద్వేష వ్యాఖ్యలపై ఈ నెల 23న ఉదయం మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం నాంపల్లి కోర్టులో ఆయనను పోలీసులు హజరుపర్చారు. ఈ విషయమై కోర్టులో ఇరు వర్గాల వాదలను విన్న తర్వాత న్యాయస్థానం రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. 41 సీఆర్‌పీసీ కింద ఎలాంటి నోటీసులు జారీ చేయని విషయాన్ని రాజాసింగ్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
ALso Read:నాపై అక్రమంగా పీడీయాక్ట్... సుప్రీంకోర్టుకెక్కిన ఎమ్మెల్యే రాజాసింగ్
మరో వైపు శాంతిభద్రతల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాజాసింగ్ ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు కు తెలిపారు. అయితే నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయిల్ ను మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో గురువారం పోలీసులు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.