తాహశీల్దార్ లావణ్య అరెస్టు: అజ్ఞాతంలోకి భర్త వెంకటేష్

By telugu teamFirst Published Jul 11, 2019, 1:10 PM IST
Highlights

లావణ్య అరెస్టుతో ఆమె భర్త వెంకటేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. వెంకటేష్ కూడా ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు. భార్య ఎసిబికి పట్టుబడగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వీఆర్వో అనంతయ్య ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో లావణ్య అక్రమాలు వెలుగు చూశాయి. 

హైదరాబాద్: అవినీతి కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగా రెడ్డి జిల్లా కేశంపేట మండలం తాహిశీల్దార్ లావణ్యను అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు బయటపడడంతో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. కాసేపట్లో ఆమెను హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు.

లావణ్య అరెస్టుతో ఆమె భర్త వెంకటేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. వెంకటేష్ కూడా ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు. భార్య ఎసిబికి పట్టుబడగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వీఆర్వో అనంతయ్య ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో లావణ్య అక్రమాలు వెలుగు చూశాయి. 

లావణ్య నివాసం నుంచి ఎసిబి అధికారులు 93 లక్షల రూపాయల నగదును, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.  లావణ్య ఇంటి నుంచి ఎసిబి అధికారులు 40 తులాల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు 

సంబంధిత వార్త

ఆమె ఉత్తమ తహశీల్దార్.. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే!

click me!