కలెక్టర్ టెన్నిస్ ఆడితే .. బాల్‌ బాయ్స్‌గా 21 మంది వీఆర్‌ఏలు, రోజుకు ముగ్గురికి డ్యూటీ

Siva Kodati |  
Published : Apr 13, 2022, 06:57 PM IST
కలెక్టర్ టెన్నిస్ ఆడితే .. బాల్‌ బాయ్స్‌గా 21 మంది వీఆర్‌ఏలు, రోజుకు ముగ్గురికి డ్యూటీ

సారాంశం

నిర్మల్ జిల్లా కలెక్టర్ వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ టెన్నిస్ ఆదే సమయంలో ఆయనకు బాల్‌బాయ్స్‌గా వ్యవహరించేందుకు 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది. 

తెలంగాణ‌ రాష్ట్రం నిర్మ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్న ముషార‌ఫ్ అలీ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. క‌లెక్ట‌ర్ టెన్నిస్ ఆడుతుంటే...బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అది కూడా అధికారికంగా.. ఈ మేరకు ఆ జిల్లాలో ఉత్త‌ర్వులు జారీ అయిపోయాయి. ఈ మేర‌కు నిర్మ‌ల్ త‌హ‌సీల్దార్ శివ‌ప్ర‌సాద్‌.. క‌లెక్ట‌ర్ టెన్నిస్ హెల్ప‌ర్లుగా 21 మంది వీఆర్ఏల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ ఓ జాబితాను విడుద‌ల చేశారు. 

ఈ జాబితాలోని 21 మంది వీఆర్ఏల‌లో రోజూ ముగ్గురు చొప్పున సాయంత్రం వేళ‌ల్లో క‌లెక్ట‌ర్ నివాసంలోని టెన్నిస్ గ్రౌండ్ వ‌ద్ద బంతులు అందించే విధుల‌కు హాజ‌రు కావాలి. ఈ జాబితా వైరల్ కావడంతో క‌లెక్ట‌ర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ముషారఫ్ అలీ ఆదేశాల‌తోనే త‌హ‌సీల్దార్ ఈ జాబితా రూపొందించారా? లేదంటే త‌నే అత్యుత్సాహంతో ఈ జాబితా విడుద‌ల చేశారా? అన్న‌ది తెలియ‌రాలేదు.

నిజానికి ప్రభుత్వ విభాగాల్లోని ఉన్నత అధికారులు.. ఇలాంటి సేవలను అనధికారికంగా చేయించుకుంటూ ఉంటారనే విమర్శలు బ్రిటీష్ కాలం నుంచి వున్నాయి. ఎందుకంటే అలా ఉద్యోగుల్ని ఇళ్లల్లో పనులకు వాడుకోవడం తప్పు. చట్టం కూడా అంగీకరించదు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్