అధికారం చేతుల్లో ఉంది కదా అని.. అన్యాయంగా ఓ మహిళ మీద అత్యాచారానికి ఒడిగట్టబోయాడు. అడ్డువచ్చిన భర్త వేలు కొరికి పారిపోయాడు. దీనిమీద పోలీసులకు ఫిర్యాదు అందింది.
వరంగల్ : కామాంధులు కన్నుమిన్ను ఎరగకుండా దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనల మీద కేసులు నమోదు చేస్తున్నా.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నా నిత్యం ఏదో ఒకచోట మాత్రం rape ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, ఓ దుర్మార్గుడు.. ఓ మహిళ మీద కన్నేశాడు. పొలాల్లోకి లాక్కెళ్లి.. అత్యాచారయత్నం చేశారు. ఇక, మహిళ గట్టిగా కేకలు వేయడంతో... womanను కాపాడేందుకు ఆమె భర్త వెళ్లాడు. దీంతో బాధితురాలి భర్త మీద దాడి చేసిన నిందితుడు.. అతడిని తీవ్రంగా గాయపర్చి, అక్కడి నుంచి పరారయ్యాడు.
warangal జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే.. కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గ్రామశివారులో Biryani Hotel పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామంలో వీఆర్ఏగా పనిచేస్తున్న అశోక్.. హోటల్ కు వెళ్లి శ్రీనివాస్ భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేడంతో అది విన్న ఆమె భర్త శ్రీనివాస్.. అశోక్ ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. అదే క్రమంలో శ్రీనివాస్ చేతివేలు తెగిపడేలా కొరికిన అశోక్..ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితుని ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్న పోతీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మీద మాట్లాడిన బాధితుడు శ్రీనివాస్ కొండాపూర్ గ్రామ శివారులో బిర్యానీ హోటల్ నడుపుతున్నాను.. నిన్న రాత్రి 9 గంటల సమయంలో అశోక్ అనే వ్యక్తి మా హోటల్ కు వచ్చి నా భార్యను పొలాల్లోకి లాక్కొనిపోయాడు. మద్యం మత్తులో నా భార్య మీద అసభ్యంగా ప్రవర్తించారు. నేను అతడిని గళ్లా పట్టుకోగా నా వేలిని పూర్తిగా కొరికి పారిపోయాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా.. పోలీసులు అతడినిి జైల్లో పెట్టాలని వేడుకున్నాడు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో ఓ కార్పొరేటర్ కొడుకు దౌర్జన్యానికి తెగబడ్డాడు. Allwyn Colony Corporator కుమారుడు రామకృష్ణ గౌడ్ ఓ మహిళ ఇంటి పైకి వెళ్లి outrageకి దిగాడు. సదరు మహిళ ఇంట్లో లేకపోవడంతో వస్తువులను, పూల కుండీలను ధ్వంసం చేయడమే కాక చంపుతాను అంటూ హెచ్చరిస్తూ నానా రభస చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
KPHB పోలీస్స్టేషన్ పరిధిలోని ద్వారకామయి మిత్ర హిల్స్ లోని ఓ ఫ్లాట్లో రత్నమాణిక్యం ఉంటుంది. ఈనెల 16 న తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది.
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కుమారుడు రామకృష్ణ గౌడ్ ఆమె ఫ్లాట్ కు వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. కోపంతో ఊగిపోతూ.. ఇంటి బయట ఉన్న పూల కుండీలు, సింక్, కిటికీలు ధ్వంసం చేశాడు. గట్టిగా కేకలు వేస్తూ అక్కడి వస్తువులు ఎత్తేశాడు. నిన్ను చంపేస్తాను అంటూ అరుస్తూ వెళ్ళిపోయాడు. ప్లాట్ లోని వారు వెంటనే రత్న మాణిక్యమ్మకు సమాచారం అందించారు. ఇంటికి చేరిన ఆమె జరిగిన ఘటన గురించి తెలుసుకొని కెపిహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేటర్ కుమారుడు ఈ దౌర్జన్యానికి పాల్పడడానికి గల కారణాలు తెలియరాలేదు.