Singareni Elections : సింగరేణి ఫలితాల్లో ఐఎన్‌టీయూసీ హవా

By Rajesh Karampoori  |  First Published Dec 28, 2023, 1:00 AM IST

Singareni Elections : సాధారణ ఎన్నికలను తలపించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. భారీ పటిష్ఠ బందోబస్త్ మధ్య లెక్కింపు జరుగుతోంది. ఈ ఫలితాల్లో ఐఎన్‌టీయూసీ ముందంజలో ఉంది.

Singareni Elections : ఏడాదిన్నర కాలంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సింగరేణి (SCCL) ఎన్నికలు ముగిశాయి. కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో  ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో ఏర్పాటు చేసిన 84 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించారు. 94.15 పోలింగ్‌ శాతం నమోదైంది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 39,773 మంది ఓటర్లలో 37,447 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రసవత్తరంగా జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్‌టీయూసీ(AITUC) ముందంజలో ఉంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఇల్లందు, కొత్తగూడెం కార్పొరేటు పరిధి, మణుగూరు, రామగుండం-3, ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ (AITUC) విజయం సాధించింది. ఇక బెల్లంపల్లి, రామగుండం-1, రామగుండం-2 ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది.

Latest Videos

బెల్లంపల్లిలో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఐఎన్‌టీయూసీపై 122 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇల్లెందులోనూ కాంగ్రెస్‌ అనుబంధ సంఘం ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. ఇక్కడ సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీపై 46 ఓట్ల తేడాతో  విజయం సాధించింది. రామగుండం 1,2లో ఏఐటీయూసీ విజయం సాధించగా.. రామగుండం 3 ఐఎన్‌టీయూసీ గెలుపొందింది. 
 
ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలువగా.. సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్‌ జరిగింది. సాధారణ ఎన్నికలను తలపించిన   ఈఎన్నికల్లో మొత్తం 39,775 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 700 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో  పాల్గొన్నారు. లెక్కింపు ప్రక్రియ ఇక కొనసాగుతోంది. 

ఏడాదిన్నర కాలంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సింగరేణి ఎన్నికలు ముగిశాయి. కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో  ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో ఏర్పాటు చేసిన 84 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించారు. 94.15 పోలింగ్‌ శాతం నమోదైంది.

ఇలా రసవత్తరంగా జరిగిన ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ గెలుపు బావుటా ఎగురవేసింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఇల్లందు, కొత్తగూడెం కార్పొరేటు పరిధి, మణుగూరు, రామగుండం-3, ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. ఇక బెల్లంపల్లి, రామగుండం-1, రామగుండం-2 ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది.

click me!