బుల్లెట్ బండిపాటపై ఓ పెళ్లి కూతురు చేసిన డాన్స్ ఎంత వైరల్ గా మారిందో తెలిసిందే. ఈ ఒక్క వీడియో, డ్యాన్స్ ఆ పెళ్లి కూతురికి సెలబ్రిటీ హోదాను తెచ్చిపెట్టింది. ఎక్కడికి వెళ్లినా ఆమెను గుర్తుపడుతూ, సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో ఆ రెస్పాన్స్ కు ఆ కొత్త జంట కూడా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. అయితే అదేపాట, అదే డ్యాన్స్ కానీ ఓ నర్సుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
రాజన్న సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండలంలోని పి.హెచ్.సిలో 15th ఆగస్ట్ రోజున బుల్లెట్ బండి పాటపై ఓ నర్స్ డాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ నర్సు డ్యాన్స్ చేసింది.. ఆసుపత్రి లోపల కావడంతో... జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ ఆమెకు మెమో జారీ చేశారు.
undefined
నాలుగు రోజుల క్రితం బుల్లెట్ బండిపాటపై ఓ పెళ్లి కూతురు చేసిన డాన్స్ ఎంత వైరల్ గా మారిందో తెలిసిందే. ఈ ఒక్క వీడియో, డ్యాన్స్ ఆ పెళ్లి కూతురికి సెలబ్రిటీ హోదాను తెచ్చిపెట్టింది. ఎక్కడికి వెళ్లినా ఆమెను గుర్తుపడుతూ, సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో ఆ రెస్పాన్స్ కు ఆ కొత్త జంట కూడా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.
అయితే అదేపాట, అదే డ్యాన్స్ కానీ ఓ నర్సుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. అనే పాటకే 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పీహెచ్సీలో కాంట్రాక్ట్ నర్స్ గా పనిచేస్తున్న ఓ మహిళ డాన్స్ చేసింది. ఏ మాత్రం బెరుకు, బెదురు లేకుండా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. దీంతో ఆమెకు మెమో జారీ అయింది.
ఈ వీడియో కూడా వైరల్ గా మారి.. అనేక విమర్శలకు దారితీసింది. కారణం ఆమె నర్స్ డ్రెస్ లో హస్పిటల్ లో ఈ డ్యాన్స్ చేయడమే. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్స్ రజని తోటి ఉద్యోగుల కోరిక మేరకు... స్వతంత్ర దినోత్సవం రోజున ఆనందంగా పిహెచ్సీ వెలుపల బుల్లెట్ బండి పాటపై డాన్స్ చేయడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనందంగా డాన్స్ చేసింది.. కానీ అది ఆసుపత్రి లోపల చేయడంతో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు ఆమెకు మెమో జారీ చేశారు. కాగా కాంట్రాక్ట్ నర్స్ రజని కరోనా సమయంలో రోగులకు సేవలు అందించి తాను కూడా కరోనా బారిన పడింది. అనంతరం కోలుకొని తిరిగి కరోనా రోగులకు సేవలు అందించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంతోషంగా ఆడి పాడుకున్నామే తప్ప వేరే ఉద్దేశం లేదని మిగతా సిబ్బంది చెబుతున్నారు.