విషాదం: నాలుగో అంతస్తు నుండి విద్యార్ధిని మృతి

Published : Jun 13, 2019, 10:30 AM IST
విషాదం: నాలుగో అంతస్తు నుండి విద్యార్ధిని మృతి

సారాంశం

 హైద్రాబాద్ నాగోల్‌లోని నాగార్జున స్కూల్‌ భవనం నాలుగో అంతస్తు నుండి  ప్రమాదవశాత్తు పడిన 9వ తరగతి విద్యార్ధిని వినీత గురువారం నాడు మృతి చెందారు.  

హైదరాబాద్: హైద్రాబాద్ నాగోల్‌లోని నాగార్జున స్కూల్‌ భవనం నాలుగో అంతస్తు నుండి  ప్రమాదవశాత్తు పడిన 9వ తరగతి విద్యార్ధిని వినీత గురువారం నాడు మృతి చెందారు.

స్కూల్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకొంది. ప్రమాదవశాత్తు బాలిక నాలుగో అంతస్తు నుండి కింద పడింది.ఈ విషయాన్ని  గుర్తించిన పాఠశాల సిబ్బంది సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.

కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్కూల్‌లోని తన క్లాస్ రూమ్‌లోకి వినీత వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడింది. ఈ భవనానికి సరైన ప్రహారగోడ లేదని స్థానికులు చెబుతున్నారు.

అయితే ప్రహారీగోడ ఎత్తు ఎక్కువగా లేదు. ఈ కారణంగా  వినీత ప్రమాదవశాత్తు కిందపడినట్టుగా  స్థానికులు చెబుతున్నారు. నాలుగో అంతస్తు నుండి కిందపడిన వెంటనే పాఠశాల సిబ్బంది కామినేని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

PREV
click me!

Recommended Stories

School Holidays: కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
TG Police Recruitment 2026: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఎంత? జీతం, క్వాలిఫికేషన్, నెగెటివ్ మార్కింగ్ ఫుల్ డీటైల్స్