మహా కిలాడీ.. విదేశీ వరుడే టార్గెట్

By telugu teamFirst Published Jun 13, 2019, 8:22 AM IST
Highlights

పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేసిన అబ్బాయిలను చాలా మందే చూసుంటారు. అయితే... ఈ  కేసు మాత్రం రివర్స్. మ్యాట్రమోనీ వెబ్ సైట్స్  లో  ఫోటోలను పెట్టి... విదేశీ కుర్రాలను టార్గెట్ చేసి.. డబ్బు గుంజడం ఈ యువతి స్పెషల్. 

పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేసిన అబ్బాయిలను చాలా మందే చూసుంటారు. అయితే... ఈ  కేసు మాత్రం రివర్స్. మ్యాట్రమోనీ వెబ్ సైట్స్  లో  ఫోటోలను పెట్టి... విదేశీ కుర్రాలను టార్గెట్ చేసి.. డబ్బు గుంజడం ఈ యువతి స్పెషల్. ఇప్పటి వరకు చాలా మందిని మోసం చేసింది. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లాకు చెందిన అర్చన(30) ఎంబీఏ చదివింది. కొంతకాలం కిందట నగరానికి వచ్చి ఓ హాస్టల్‌లో ఉంటోంది. పెళ్లి పేరుతో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడడం ఆమె ప్రవృత్తిగా మారింది. గూగుల్‌ ఇమేజెస్‌ నుంచి అందమైన యువతుల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకుంటుంది. విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో ఉంటున్న వరుడు కావాలంటూ వెబ్‌సైట్లలో ప్రకటిస్తుంది. వాటికి స్పందించి ముందుకు వచ్చే వరులు, వారి తల్లిదండ్రులను ముగ్గులోకి దించి మోసగిస్తోంది. 

పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమేనని చెప్పేది. ఎంగేజ్ మెంట్ కి ఉంగరాలు, ఆభరణాలు అంటూ సాకులు చెప్పి... వారి దగ్గర నుంచి డబ్బులు గుంజేది.వారిని నేరుగా కలవకుండా జాగ్రత్తపడుతూ ఫోన్‌, ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు సాగిస్తుంది. ఇతర కుటుంబసభ్యుల మాదిరిగా గొంతుమార్చి మాట్లాడేది. ఆమె మోసాన్ని గుర్తించని వారు నమ్మి డబ్బులు ఇవ్వగానే ఇక ఫోన్లు చేయడం మానేసేది. వెంటనే నెంబర్ కూడా మార్చేసేది. 

ఇలా ఆమె మాయలో పడి మోసపోయిన ఓ కుటుంబం ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా... ఆమె బండారం బయటపడింది. ఆమెను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. 

click me!