వినాయక చవితి: పూజాసామాగ్రి కోసం రోడ్లపైకి భక్తులు.. హైదరాబాద్‌లో పండుగ శోభ, ట్రాఫిక్ జాం

By Siva KodatiFirst Published Sep 9, 2021, 10:01 PM IST
Highlights

అలంకరణ, పూజ సామగ్రి కోసం రోడ్లపైకి రావటంతో హైదరాబాద్‌లో జనసందడి పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ కూడా పెరిగింది.  ముఖ్యంగా పండుగకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలతో బేగంబజార్‌ కిటకిటలాడింది. విభిన్న వినాయకుని విగ్రహాలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. 
 

వినాయక చవితి పర్వదినం కావడంతో హైదరాబాద్ నగరం పండగ శోభను సంతరించుకుంది. మండపాలను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు విగ్రహాలను సిద్ధం చేసుకున్నారు. అలాగే రోడ్లపై విగ్రహాల తరలింపునకు సంబంధించిన వాహనాలతో కోలాహలం నెలకొంది. అటు పండుగ పూజా సామగ్రి కోసం ప్రజలు రోడ్లపైకి రావడంతో కొన్ని ప్రాంతాల్లో సందడి నెలకొంది. హైదరాబాద్‌లోని దూల్‌పేట విగ్రహాల తయారీకి ప్రధాన కేంద్రం. ఇక్కడికి తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. చివరి నిమిషం వరకు కొనుగోళ్లు జరుపుతుంటారు. అయితే, ఈసారి కరోనా భయాలు సమసిపోకపోవడంతో... విగ్రహాల తయారి అంతంత మాత్రంగానే వుంది. దీంతో అందుబాటులో ఉన్న విగ్రహాల సంఖ్య తగ్గిపోయింది.

ALso Read:వినాయక విగ్రహల నిమజ్జనం: హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

చాలా మంది ఇప్పటికే విగ్రహాలను తీసుకెళ్లారు. పెద్ద విగ్రహాలను మండపాల నిర్వాహకులు తీసుకెళ్లగా, చిన్న విగ్రహాలు మాత్రమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. చాలా మంది విగ్రహాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. తగినన్ని విగ్రహాలు అందుబాటులో లేవు. విగ్రహాల కోసం వస్తున్న వారితో పాటు స్థానికంగా ఉండే వారు అలంకరణ, పూజ సామగ్రి కోసం రోడ్లపైకి రావటంతో జనసందడి పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ కూడా పెరిగింది.  ముఖ్యంగా పండుగకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలతో బేగంబజార్‌ కిటకిటలాడింది. విభిన్న వినాయకుని విగ్రహాలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. 

click me!