కరోనా భయం... మా ఊరికి ఎవరూ రావొద్దంటూ..

By telugu news teamFirst Published Mar 24, 2020, 8:54 AM IST
Highlights

జడ్పీటీసీ సభ్యురాలు మేఘమాల, ఇన్ ఛార్జి సర్పంచి ఉమారాణి ఆధ్వర్యంలో గ్రామానికి రెండు వైపులా రోడ్డు మూసేశారు. రోడ్లపై వీఆర్ఏలను కాపలా పెట్టారు.  గ్రామంలో ఎవరూ గుంపులుగా గుమ్మికూడ వద్దంటూ దండోరా కూడా వేయించడం గమనార్హం.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. దీంతో ఈ వైరస్ పేరు వింటనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎవరికి వారు ఇళ్లల్లో నుంచి కదలకుండా ఉండిపోతున్నారు. కాగా... కొన్ని గ్రామాల ప్రజలైతే తమను తాము రక్షించుకోవడానికి ఆంక్షలు విధిస్తున్నారు.

Also Read కరోనా దెబ్బ... ఎమ్మెల్యే మనవరాలి పెళ్లి వాయిదా...

మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామస్థులు తమ గ్రామంలోకి ఎవరినీ అనుమతించకూడదని తీర్మానించారు. జడ్పీటీసీ సభ్యురాలు మేఘమాల, ఇన్ ఛార్జి సర్పంచి ఉమారాణి ఆధ్వర్యంలో గ్రామానికి రెండు వైపులా రోడ్డు మూసేశారు. రోడ్లపై వీఆర్ఏలను కాపలా పెట్టారు.  గ్రామంలో ఎవరూ గుంపులుగా గుమ్మికూడ వద్దంటూ దండోరా కూడా వేయించడం గమనార్హం.

కామారెడ్డి జిల్లా జుక్కల్, మద్నూర్ మండలాలు కర్ణాటక, మహారాష్ట్రతో సరిహద్దున ఉన్నాయి. కరోనా భయంతో పంచాయతీ పాలకులు, ప్రజలు చైతన్యవంతులై సరిహద్దు గ్రామాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. ట్రాక్టర్లు, ట్యాంకర్లను రోడ్డుకు అడ్డుగా ఉంచి, కాలి నడకన వచ్చే వారిని గ్రామాల్లో అనుమతించడం లేదు.

click me!