మంత్రి గంగులకు చేదు అనుభవం... దశాబ్ది ఉత్సవాలకు వెళితే అడ్డుకున్న దళితులు (వీడియో)

Published : Jun 16, 2023, 05:17 PM ISTUpdated : Jun 16, 2023, 05:24 PM IST
మంత్రి గంగులకు చేదు అనుభవం... దశాబ్ది ఉత్సవాలకు వెళితే అడ్డుకున్న దళితులు (వీడియో)

సారాంశం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ కు చేదు అనుభవం  ఎదురయ్యింది. 

కరీంనగర్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ కు నిరసన సెగ తగిలింది. కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూత్కూరులో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఒక్కరికి కూడా దళిత బంధు అందలేదంటూ దళితులు ఆందోళనకు దిగారు. గంగులను అడ్డుకున్న గ్రామస్తులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. చివరకు అందరికీ దళిత బంధు అందేలా చూస్తానని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇవ్వడంతో దళితులంతా శాంతించి ఆందోళనను విరమించారు. దీంతో మంత్రి పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వీడియో

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?