యువతికి కరోనా.. గ్రామంలోకి అనుమతించకపోవడంతో...

Published : Mar 30, 2021, 08:57 AM IST
యువతికి కరోనా.. గ్రామంలోకి అనుమతించకపోవడంతో...

సారాంశం

తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడకు చెందిన మడాని సోన్ దేవి అనే యువతి గురుకులంలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల యువతికి కరోనా సోకింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసేస్తోంది. గత ఏడాదిగా.. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసేసింది. ఈ వైరస్ బారిన ఇప్పటికే చాలా మంది పడ్డారు. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పెద్ద, చిన్న , ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. అయినప్పటికీ..చాలా ప్రాంతాల్లో వైరస్ సోకిన వారిని హీనంగా చూస్తున్నారు. తాజాగా.. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడకు చెందిన మడాని సోన్ దేవి అనే యువతి గురుకులంలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల యువతికి కరోనా సోకింది. దీంతో ఆమె స్వగ్రామానికి వచ్చింది. అయితే.. స్వగ్రామానికి వచ్చిన యువతిని గ్రామస్థులు ఊళ్లోకి రానివ్వలేదు.

దీంతో.. యువతి గ్యతంతరం లేక ఊరి చివరన ఉన్న తమ పొలంలోనే ఉండిపోయింది. ఐసోలేషన్ పేరిట పొలంలో చిన్న టెంటు వేసి ఆమెను అక్కడ వదిలేశారు. రాత్రి పూట చీకటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.

సోమవారం ఏటీడబ్ల్యూఓ క్రాంతికుమార్, గురుకులం ఆర్సీఓ గంగాధర్ ఆమెను పరామర్శించారు. ఆ పై గ్రామంలోకి అనుమతించాలని పంచాయతీ పెద్దలతో చర్చలు జరిపారు. అయినప్పటికీ.. వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరో నాలుగు రోజులు గడిస్తే.. క్వారంటైన్ పూర్తౌతుందని అప్పుడు అనుమతిస్తామని వారు చెప్పడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే