వికారాబాద్ శిరీష కేసు : అన్ని వేళ్లూ అతడిపైనే.. ఆ రాత్రి ఏం జరిగింది, మిస్టరీ ఛేదించే యత్నాల్లో పోలీసులు

Siva Kodati |  
Published : Jun 11, 2023, 09:21 PM IST
వికారాబాద్ శిరీష కేసు : అన్ని వేళ్లూ అతడిపైనే.. ఆ రాత్రి ఏం జరిగింది, మిస్టరీ ఛేదించే యత్నాల్లో పోలీసులు

సారాంశం

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్ధిని శిరీష హత్య కేసు కలకలం రేపుతోంది. అక్క భర్త కొట్టడం వల్ల మనస్తాపానికి గురైన ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ శిరీషను ఎవరు హత్య చేశారో తేలాల్సి వుంది. 

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్ధిని శిరీష హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా నిన్న రాత్రి ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తల్లి అనారోగ్యం కారణంగా శిరీష నిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించేందుకు వచ్చింది. తండ్రి, సోదరుడు మాత్రమే నిన్న రాత్రి ఇంట్లో వున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో అక్క భర్త అనిల్‌తో వాగ్వాదం జరగ్గా.. అతను చేయి చేసుకున్నట్లుగా సమాచారం. ఆ రోజు అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన శిరీష ఇంటికి దగ్గరలోని నీటి కుంటలో శవమై తేలింది. 

ప్రస్తుతం శిరీష అక్క భర్త అనిల్‌ వైపు అన్నీ వేళ్లూ చూపిస్తూ వుండటంతో అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శిరీష తండ్రిని, అన్నను ఇప్పటికే ప్రశ్నించామని పోలీసులు వెల్లడించారు. అనిల్ కొట్టడం వల్ల మనస్తాపానికి గురై శిరీష బయటకు వెళ్లిందని.. అలాగే ఆమెను ఒక్కరే హతమార్చి వుంటారని తాము భావించడం లేదని , త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై మృతురాలి సోదరి శ్రీలత మాట్లాడుతూ.. తమ ఇంటికి దగ్గరలోనే వున్న నీటి గుంటలో శిరీష శవమై తేలిందన్నారు. తమ కుటుంబానికి ఎవరి మీదా అనుమానం లేదని శ్రీలత చెప్పారు. శిరీష మొబైల్ ఫోన్ చెక్ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆమె తెలిపారు. 

ALso Read: వికారాబాద్ శిరీష హత్య కేసు .. కీలకంగా మారిన సెల్‌ఫోన్, మృతురాలి సోదరి వాదన ఇదే

చివరిసారిగా శనివారం రాత్రి శిరీష బయటకు వెళ్లి .. మళ్లీ తిరిగిరాలేదని, ఆ లోపే ఈ ఘోరం జరిగిందని శ్రీలత కన్నీటి పర్యంతమైంది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో గ్రామంలో వెతికామని, తెలిసినవాళ్లను ఎంక్వైరీ చేశామని చెప్పింది. ఈ క్రమంలోనే శిరీష మృతదేహాన్ని నీటి గుంతలో చూశామని శ్రీలత వెల్లడించింది. తన తల్లి అనారోగ్యం కారణంగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని.. ఇంట్లోనే నేను, అన్నయ్య, శిరీష , తమ్ముడు వుంటామని చెప్పింది. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu