తాండూరులో టెన్త్ పేపర్ లీక్ ప్రచారం: పోలీసుల దర్యాప్తు

Published : Apr 03, 2023, 02:37 PM IST
తాండూరులో  టెన్త్ పేపర్ లీక్ ప్రచారం: పోలీసుల దర్యాప్తు

సారాంశం

వికారాబాద్  జిల్లాలో టెన్త్ పేపర్ లీక్  అయిందని  జరుగుతున్న  ప్రచారంపై   పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.ఈ విషయమై   డీఈఓ  రేణుకాదేవి  కలెక్టర్ నారాయణరెడ్డితో సమావేశమయ్యారు. 

వికారాబాద్: జిల్లాలోని  తాండూరు    నెంబర్ వన్ స్కూల్ లో  టెన్త్ ప్రశ్నాపత్రం  లీక్ అయిందనే  ప్రచారంపై  పోలీసులు దర్యాప్తును  ప్రారంభించారు.  ఇవాళ  ఉదయం  తెలంగాణలో  టెన్త్  పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.  

టెన్త్  పరీక్షలు  ప్రారంభమైన  కొద్దిసేపటికే  ఈ స్కూల్ నుండి  పేపర్  వాట్సాప్ లో  బయటకు వచ్చిందనే  ప్రచారం సాగుతుంది.  ఈ విషయమై  పోలీసులు విచారణను ప్రారంభించారు.  ఈ స్కూల్ కు  చెందిన   ఓ టీచర్  నుండి  పేపర్ బయటకు వచ్చిందనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై వాస్తవాలను తెలుసుకొనేందుకు  పోలీసులు ఈ స్కూల్ వద్దకు  వచ్చి విచారణను ప్రారంభించారు.  టెన్త్ పేపర్ లీక్  జరిగిందనే  ప్రచారంపై   జిల్లా అధికారులు  కూడ అప్రమత్తమయ్యారు.  వికారాబాద్  జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో డీఈఓ  రేణుకాదేవి  సమావేశమయ్యారు.   
 

PREV
click me!

Recommended Stories

Kondagattu పున‌ర్జ‌న్మ ఇచ్చింద‌ని Pawan Kalyan ఎందుక‌న్నారు? | Anjaneya Swamy | Asianet News Telugu
MLA Medipally Satyam Emotional Words: ఆంజనేయస్వామే పవన్ కళ్యాణ్ గారినికాపాడారు | Asianet News Telugu