
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలో భారీగా డబ్బులు జమ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న తమిళనాడులోని పలువురు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలో భారీగా డబ్బులు జమ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలోని వికారాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వ్యాపారి వెంకట్ రెడ్డి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 18.52 కోట్లు జమ అయ్యాయి. దీంతో వెంకట్ రెడ్డి బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక సమస్యతోనే ఇలా జరిగిందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. డబ్బు జమ అయిన ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. కొత్త సాఫ్ట్‌వేర్ వేసే క్రమంలో ఇలా జరిగిందని అధికారులు తెలిపారు.
ఇక, చెన్నైలో ఓ వందమంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(HDFC Bank) వినియోగదారులకు ఖాతాల్లో భారీగా డబ్బులు జమయ్యాయి. ఏకంగా వారి ఖాతాలకు రూ13 కోట్ల చొప్పున డబ్బు డిపాజిట్ అయ్యింది. వీరితో పాటు మరి కొందరికి రూ. లక్షల నగదు వచ్చి చేరింది. ఈ సమాచారం వారికి ఎస్ ఎంఎస్ రూపంలో అందటంతో కొందరు బ్యాంకులకు పరుగులు తీశారు. ఎంటీఎంల్లో క్యూలు కట్టారు.
Also Read: HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు "కోటీశ్వర్లు".. 100 మంది ఖాతాల్లో రూ.13 కోట్లు.. !
తమ తప్పిదం అని గ్రహించిన బ్యాంకు అధికారులు.. వెంటనే అప్రమత్తమయ్యారు. సరిదిద్దు బాటు చర్యలు చేపట్టారు. ఆ నగదును వెనక్కి తీసుకున్నారు.సాప్ట్ వేర్ లోపం ఇలా జరిగినట్టు తెలిపారు. ఇక, ఈ 100 మందే కాకుండా మరి కొంత మంది(HDFC Bank) ఖాతాలకు రూ.10,000, రూ.50,000, రూ.లక్ష నగదు డిపాజిట్ అయ్యినట్టు అధికారులు గుర్తించారు.
శనివారం సాధారణ నిర్వహణ పనులు చేపట్టడంతో ఈ సమస్య తలెత్తిందని బ్యాంకు అధికారులు తెలిపారు. ‘‘మేము సమస్యను గుర్తించాము. ఈ ఖాతాల డెబిట్ సేవలను బ్లాక్ చేసాము. ఈ సమస్య దేశవ్యాప్తంగా చోటుచేసుకుంది. 80 శాతానికి పైగా పరిష్కరించబడింది. ఈ సమస్య చెన్నైలోని దాదాపు 10 శాతం బ్యాంక్ శాఖలలో నివేదించబడింది’’ అని బ్యాంకు అధికారులు చెప్పారు.