సుహాసినికి మద్దతుగా..ప్రచారం చేసిన కళ్యాణ్ రామ్ భార్య

Published : Nov 30, 2018, 01:05 PM IST
సుహాసినికి మద్దతుగా..ప్రచారం చేసిన కళ్యాణ్ రామ్ భార్య

సారాంశం

 సుహాసిని వదిన, హీరో కళ్యాణ్ రామ్ భార్య స్వాతి సుహాసినికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.

నందమూరి సుహాసినికి మహాకూటమి తరపున కూకట్ పల్లి అభ్యర్థిగా టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేసిన నాటి నుంచి సుహాసిని కూకట్ పల్లిలోని ప్రతి ప్రాంతానికి తిరుగుతూ.. తనను గెలిపించాలని కోరుతున్నారు. ఆమె మద్దతుగా ఇప్పటికే సోదరుడు తారక రత్న, ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారం చేశారు.

తాజాగా.. సుహాసిని వదిన, హీరో కళ్యాణ్ రామ్ భార్య స్వాతి సుహాసినికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. భగత్ సింగ్ నగర్, వసంత్ నగర్ లో గురువారం  స్వాతి ప్రచారం నిర్వహించారు. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మా వదిన సుహాసినిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కాగా.. నందమూరి కుటుంబం నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ, హీరోలు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కూడా త్వరలో నందమూరి సుహాసిని తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!