మంత్రులు లేని ప్రభుత్వం, నీళ్లు లేని ఫైరింజన్లు : విజయశాంతి ఫైర్

By Nagaraju TFirst Published Jan 31, 2019, 5:49 PM IST
Highlights

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై స్పందించిన ఆమె ప్రభుత్వ వ్యవహార శైలిపై మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. మంత్రులు లేని ప్రభుత్వం, నీళ్లు లేని ఫైరింజన్లు ఇది ప్రస్తుతం తెలంగాణలో పాలన అంటూ విమర్శించారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే పట్టించుకునే నాదుడే కరువయ్యడాని కనీసం పలకరించేందుకు ప్రభుత్వం కూడా లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి విమర్శించారు. 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై స్పందించిన ఆమె ప్రభుత్వ వ్యవహార శైలిపై మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. మంత్రులు లేని ప్రభుత్వం, నీళ్లు లేని ఫైరింజన్లు ఇది ప్రస్తుతం తెలంగాణలో పాలన అంటూ విమర్శించారు. 

ప్రజల ప్రాణాలంటే విలువ తెలియని ప్రజాపాలన సాగుతోందంటూ ధ్వజమెత్తారు. ఇలాంటి దుస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారని ఇది చాలా దురదృష్ఖరమన్నారు. ఇలాంటి పరిపానలననా తెలంగాణ ప్రజలు కోరుకున్నది అంటూ విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. 
 
click me!