తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మరో షాక్ తగిలింది. మహిళా నేత, సినీ నటి విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపారు రాములమ్మ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మరో షాక్ తగిలింది. మహిళా నేత, సినీ నటి విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపారు రాములమ్మ.
కాగా.. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై బిజెపి అభ్యర్థి అన్నారు... ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అన్నారు... ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయశాంతి కీలక పాత్ర పోషించనున్నారంటూ రాజకీయ ప్రచారం జరిగింది. కానీ అటు అభ్యర్థిగానే కాదు ఇటు క్యాంపెయినర్ గానూ ఆమెకు అవకాశం దక్కకపొవడం పలు అనుమానాలకు దారితీసింది. బిజెపిలో తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో విజయశాంతి తీవ్ర అసంతృప్తితో వున్నారని... తన రాజకీయ భవిష్యత్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో విజయశాంతి కూడా బిజెపిని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తాజాగా తెరదించారు విజయశాంతి.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో విజయశాంతి పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక సొంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. కానీ, ఆ తర్వాత ఆ పార్టీలోని అప్పటి టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. అనంతరం, కాంగ్రెస్‌లోకి, ఆ తర్వాత బీజేపీలోకి విజయశాంతి మారారు. బీజేపీలో సుదీర్ఘకాలం నుంచే ఆమె కొనసాగుతున్నారు. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించినప్పటి నుంచి ఆమె పార్టీలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఇటీవలే పార్టీని లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
మరోవైపు.. మరోవైపు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి రాములమ్మకు పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న విధంగా ఫలితాలు వెలువడితే.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు మెదక్ సిట్మెంట్ నుంచి టికెట్ ఇస్తామనే కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.