బిడ్డా అని గురువుగారు, శాంతమ్మా అని పిలిచే మీరు వెళ్లిపోవడం.....: విజయశాంతి భావోద్వేగం

Published : Feb 23, 2019, 08:31 AM IST
బిడ్డా అని గురువుగారు, శాంతమ్మా అని పిలిచే మీరు వెళ్లిపోవడం.....: విజయశాంతి భావోద్వేగం

సారాంశం

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 10 సినిమాలలో తాను నటించానని అయితే వాటిలో 8 సూపర్ హిట్ అయ్యాయంటూ చెప్పుకొచ్చారు. మిగిలిన రెండు హిట్ అయ్యాయన్నారు. దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణలు మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు. అయితే మిమ్మల్ని ఎప్పటికీ గౌరవించుకుంటూనే ఉంటాం సార్ అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి చెందడంపై సినీనటి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి భావోద్వేగానికి లోనయ్యారు. శాంతమ్మా అంటూ ఆప్యాయంగా తనను దీవించే కోడి రామకృష్ణ చనిపోవడంతో బోరున విలపించారు. 

బిడ్డా అని అభిమానంతో పిలిచే దాసరి నారాయణరావు, శాంతమ్మా అని ఆప్యాయతలతో దీవించే కోడి రామకృష్ణలను కోల్పోవడం ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదన్నారు. టి.కృష్ణ వంటి దర్శకుడి తర్వాత తాను గౌరవించి అభిమానించే ఇద్దరు మహోన్నత స్థాయి కలిగిన దర్శకులు దర్శకరత్న దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణలేనన్నారు. 

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 10 సినిమాలలో తాను నటించానని అయితే వాటిలో 8 సూపర్ హిట్ అయ్యాయంటూ చెప్పుకొచ్చారు. మిగిలిన రెండు హిట్ అయ్యాయన్నారు. దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణలు మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు. అయితే మిమ్మల్ని ఎప్పటికీ గౌరవించుకుంటూనే ఉంటాం సార్ అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!