డిప్యూటీ స్పీకర్‌గా మాజీ మంత్రి...సోమవారం ఎన్నిక

By Arun Kumar PFirst Published Feb 22, 2019, 4:29 PM IST
Highlights

శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత బిఏసి(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశమయ్యింది. ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. అయితే మధ్యలో ఆదివారం సెలవురోజు కావడంతో మరో రెండు రోజులే అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. 
 
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై కూడా బీఏసీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ మేరకు రేపు ఉపసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. స్పీకర్ మాదిరిగానే డిప్యూటి స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవం కానుంది. 

 ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శనివారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. అలాగే సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిపి సభ ఆమోదించనుంది. అలాగే అదేరోజు ఉపసభాపతిని ఎన్నిక జరగనుంది. 

డిప్యూటి స్పీకర్ గా సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పద్మారావు పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాదాపు ఆయన ఎంపిక ఖరారైనట్లు...అధికారికంగా సోమవారం ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. 
 
click me!