పీటలపైనే వరుడికి షాకిచ్చిన వధువు: అర్ధాంతరంగా పెళ్లి రద్దు

By narsimha lodeFirst Published 22, Feb 2019, 4:31 PM IST
Highlights

కొద్ది నిమిషాల్లో పెళ్లి.... అయితే వధువు చేసిన పనికి పెళ్లికి వచ్చిన వారంతా షాక్‌కు గురయ్యారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి తనకు వద్దని  వధువు పెళ్లి పీటల నుండి లేచి వెళ్లిపోయింది. 

మహబూబాబాద్: కొద్ది నిమిషాల్లో పెళ్లి.... అయితే వధువు చేసిన పనికి పెళ్లికి వచ్చిన వారంతా షాక్‌కు గురయ్యారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి తనకు వద్దని  వధువు పెళ్లి పీటల నుండి లేచి వెళ్లిపోయింది. ఈ ఘటన మహబూబాబాద్‌లో చోటు చేసుకొంది.

మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువకుడికి ఖమ్మం జిల్లాకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి కుదిర్చారు. అయితే ఈ పెళ్లి నచ్చలేదని వధువు కుటుంబసభ్యులకు మాత్రం చెప్పలేదు.

పెళ్లి పీటలపై కూడ వచ్చి కూర్చొంది. పెళ్లి తంతులో భాగంగా జీలకర్ర, బెల్లం తంతు కూడ పూర్తైంది. తాళి కట్టేందుకు వరుడు తాళి పట్టుకొని లేచాడు.  కానీ ఆమె వరుడిని నెట్టేసి పెళ్లి మండపం నుండి  వెళ్లిపోయింది.

అయితే వధూవరులకు నచ్చజెప్పేందుకు పోలీసులు కూడ  ప్రయత్నించారు. కానీ, వధువు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో అర్ధాంతరంగా పెళ్లిని  రద్దు చేసుకొన్నారు. 

 

 

Last Updated 22, Feb 2019, 4:31 PM IST