బీజేపీలోకి రాములమ్మ.. మరి ఆ పక్కనుందెవరు..?

By telugu news teamFirst Published Dec 7, 2020, 1:44 PM IST
Highlights

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నుంచి స్వామిగౌడ్‌ బీజేపీలో చేరగా.. కాంగ్రెస్‌ నుంచి కాషాయం తీర్థం పుచ్చుకునేందుకు విజయశాంతి రంగం సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. 

తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న అన్ని ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాని తర్వాత తెలంగాణలో మరింత బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ మంత్రానికి తెరలేపింది.

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నుంచి స్వామిగౌడ్‌ బీజేపీలో చేరగా.. కాంగ్రెస్‌ నుంచి కాషాయం తీర్థం పుచ్చుకునేందుకు విజయశాంతి రంగం సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఆమె  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఆమె అమిత్‌షా, ఇతర పెద్దలను కలిశారు. దానికి సంబంధించిన  ఓ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే.. ఆ ఫొటోలో పసుపు రంగు చీరలో ఉన్న ఓ మహిళపై అందరి దృష్టి పడింది. ఆమె తెలంగాణ తొలి పైలట్‌ అజ్మీరా బాబీ అని తెలుస్తోంది. ఆమె కూడా సోమవారం అధికారికంగా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. మంచిర్యాలకు చెందిన బాబీ తల్లిదండ్రులు అజ్మీరా హరిరాం నాయక్‌, జయశ్రీ ఉపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. ఎంబీఏ పూర్తిచేసిన బాబీ.. విమానయాన రంగంపై ఆసక్తితో తొలుత ఎయిర్‌ హోస్టె్‌సగా పనిచేశారు. ఆ తర్వాత పైలట్‌గా శిక్షణ పొందారు. ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.

click me!