ఎఐసిసి కార్యదర్శి పదవికి విహెచ్ రాజీనామా

Published : Jun 30, 2019, 07:02 AM IST
ఎఐసిసి కార్యదర్శి పదవికి విహెచ్ రాజీనామా

సారాంశం

తన రాజీనామా లేఖను విహెచ్ సోనియా గాంధీకి, రాహుల్‌ గాంధీకి పంపించారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ ఒక్కరే బాధ్యత వహించకూడదని ఆయన అన్నారు.

హైదరాబాద్‌: ఎఐసిసి కార్యదర్శి పదవికి తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరుతూ కాంగ్రెసు నేతలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా విహెచ్ తన పార్టీ పదవికి శనివారంనాడు రాజీనామా చేశారు. 

తన రాజీనామా లేఖను విహెచ్ సోనియా గాంధీకి, రాహుల్‌ గాంధీకి పంపించారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ ఒక్కరే బాధ్యత వహించకూడదని ఆయన అన్నారు. సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలకూ బాధ్యత ఉంటుందని అయన అభిప్రాయపడ్డారు. 

ఎన్నికల్లో ప్యారాచూట్‌ నేతలకు టికెట్లు ఇవ్వడమే తెలంగాణలో పార్టీ ఓటమికి కారణమని విహెచ్ అన్నారు. పార్టీ అధ్యక్ష పదవిలో రాహుల్‌ ఉంటేనే కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటి నుంచైనా పార్టీ సీనియర్‌ నేతలకు కూడా సమయం కేటాయించాలని, పార్టీ అభివృద్ధి కోసం వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని అన్నారు.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu