తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం: ఆస్తుల పంపకాలపై కీలక చర్చ

Published : Jun 29, 2019, 08:00 PM IST
తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం: ఆస్తుల పంపకాలపై కీలక చర్చ

సారాంశం

షెడ్యూల్ తొమ్మిది, పదిలోని సంస్థల విభజన, ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విభజన, ఇతర నిధుల విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించారు.  ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలపై ఉన్నతాధికారులు చర్చించారు. సమావేశంలో ఆస్తుల పంపకానికి ఏకాభిప్రాయానికి వస్తే జూలై 3న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో ఉన్నతాధికారులు భేటీ కానున్నారు.

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల బృందం మరోసారి భేటీ అయ్యింది. ప్రగతి భవన్ వేదికగా సమావేశమైన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు శుక్రవారం నాటి సమావేశంలో ముఖ్యమంత్రులు కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు సూచించిన అంశాలపై చర్చించారు. 
 
షెడ్యూల్ తొమ్మిది, పదిలోని సంస్థల విభజన, ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విభజన, ఇతర నిధుల విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించారు.  ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలపై ఉన్నతాధికారులు చర్చించారు. 

సమావేశంలో ఆస్తుల పంపకానికి ఏకాభిప్రాయానికి వస్తే జూలై 3న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఆస్తుల విభజనకు సంబంధించి నివేదికను గవర్నర్ నరసింహన్ కు సమర్పించే అవకాశం ఉంది. 

ఇకపోతే ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్ కే జోషి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అజయ్ కల్లమ్, ఆర్ధిక మరియు ఎస్ ఆర్ ముఖ్యకార్యదర్శిలు రామకృష్ణారావు, రాజేశ్వరరావులు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?